ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమిరేట్ ఎయిర్‌లైన్స్ ఆసక్తికర ప్రకటన..

ABN, First Publish Date - 2021-12-20T14:51:41+05:30

యూఏఈకి చెందిన విమానయాన సంస్థ ఎమిరేట్స్ ఆదివారం రోజు ఆసక్తికర ప్రకటన చేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. ఇంతకూ ఎమిరేట్స్ ప్రకటన ఏంటి అనే వివరాల్లోకి వెళితే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: యూఏఈకి చెందిన విమానయాన సంస్థ ఎమిరేట్స్ ఆదివారం రోజు ఆసక్తికర ప్రకటన చేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. ఇంతకూ ఎమిరేట్స్ ప్రకటన ఏంటి అనే వివరాల్లోకి వెళితే..


ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ కొత్త వేరియంట్ విజృంభిస్తోంది. జట్ స్పీడ్‌తో ఈ వేరియంట్ వ్యాప్తి చెందుతుండటంతో ఇప్పటికే కొన్ని దేశాల్లో భారీ మొత్తంలో కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో దేశాలన్నీ అప్రమత్తవతున్నాయి. తిరిగి కఠిన ఆంక్షలను అమలు చేసే విషయంపై దృష్టిసారించాయి. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఎమిరేట్స్ ఆసక్తికర ప్రకటన చేసింది. విమాన సర్వీసులను పెంచే అంశంపై భారత ప్రభుత్వంతో చర్చలు జరగుతున్నట్టు తెలిపింది.  చర్చలు సఫలం అయితే.. ఇండియాకు పూర్తి స్థాయిలో విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నట్టు వెల్లడించింది. ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ మహ్మద్ సర్హాన్‌.. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా 90శాతం తమ నెట్‌వర్క్‌‌ను ఇప్పటికే పునరుద్దరించినట్టు తెలిపారు. రానున్న 18 నెలల్లో నష్టాలను పూర్తి స్థాయిలో అధిగమిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా.. భారత్‌లో కూడా ఒమైక్రాన్ వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్నందున ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుదనేది చర్చనీయాంశంగా మారింది. 


ఇదిలా ఉంటే.. కొవిడ్ ఎఫెక్ట్‌తో భారత ప్రభుత్వం అంతర్జాతీయ విమాన సర్వీసులపై మార్చి 2020లో నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే.. యూఏఈ సహా 34దేశాలతో ఎయిర్‌బబూల్ ఒప్పందం కుదుర్చుకోవడంతో.. పరిమిత సంఖ్యలో విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. 




Updated Date - 2021-12-20T14:51:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising