ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

COVID-19 Vaccination: చిక్కుకుపోయిన ప్ర‌వాసుల కోసం.. భార‌త ఎంబ‌సీ స్పెష‌ల్ డ్రైవ్‌!

ABN, First Publish Date - 2021-06-23T16:36:32+05:30

క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌యాణాల‌పై ఆంక్ష‌ల కార‌ణంగా చిక్కుకుపోయిన ప్ర‌వాసుల ప్ర‌యాణ అడ్డంకుల‌ను తొల‌గించేందుకు కువైట్‌లోని భార‌త రాయ‌బార కార్యాల‌యం ఓ స్పెష‌ల్ డ్రైవ్‌ను ప్రారంభించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీకా స‌ర్టిఫికెట్ల రిజిస్ట్రేష‌న్ డ్రైవ్ ప్రారంభించిన రాయ‌బార కార్యాల‌యం

కువైట్ సిటీ: క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌యాణాల‌పై ఆంక్ష‌ల కార‌ణంగా చిక్కుకుపోయిన ప్ర‌వాసుల ప్ర‌యాణ అడ్డంకుల‌ను తొల‌గించేందుకు కువైట్‌లోని భార‌త రాయ‌బార కార్యాల‌యం ఓ స్పెష‌ల్ డ్రైవ్‌ను ప్రారంభించింది. వ్యాక్సిన్‌ స‌ర్టిఫికెట్‌ రిజిస్ట్రేష‌న్ డ్రైవ్ చేప‌ట్టింది. ఇటీవ‌ల కువైట్ మంత్రిమండ‌లి ఇండియాపై విధించిన ప్ర‌యాణ ఆంక్ష‌ల‌ను ఆగ‌స్టు 1 నుంచి తొల‌గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన విష‌యం విదిత‌మే. ఈ నేప‌థ్యంలో ఇక్క‌డి ఇండియ‌న్‌ ఎంబ‌సీ అధికారులు భార‌త ప్ర‌వాసుల‌ ప్ర‌యాణాల‌కు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసేందుకు ఈ స్పెష‌ల్ డ్రైవ్ నిర్వ‌హిస్తున్నారు. 


దీనిలో భాగంగా భార‌త ప్ర‌యాణికులు టీకా తీసుకున్నారా? లేదా? తీసుకుంటే వ్యాక్సిన్ స‌ర్టిఫికేట్ వివ‌రాల‌ను సేక‌రిస్తారు. అలాగే ప్ర‌యాణానికి కావాల్సిన ఇత‌ర అంశాలు, ప్ర‌యాణికులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ఎప్ప‌టిక‌ప్ప‌డు తెలుసుకుంటారు. అనంత‌రం వీటి ప‌రిష్కారం కోసం సంబంధిత కువైట్ అధికారుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకుంటూ ప్ర‌యాణాల‌కు ఉన్న అంత‌రాల‌ను తొల‌గించ‌డం కోస‌మే ఈ స్పెష‌ల్ డ్రైవ్ చేప‌ట్టింది భార‌త ఎంబ‌సీ. దీనికోసం భార‌త ప్ర‌యాణికులు https://forms.gle/ZgRpFBTFV5V24Vqb8 లింక్ ద్వారా త‌మ పేర్లు న‌మోదు చేసుకోవాల‌ని రాయ‌బార కార్యాల‌యం వెల్ల‌డించింది. 

Updated Date - 2021-06-23T16:36:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising