ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కువైట్‌లోని భారత ఎంబసీ.. సందర్శకుల కోసం ఉచిత వాహన సౌకర్యం

ABN, First Publish Date - 2021-04-06T22:26:58+05:30

కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం సందర్శకుల కోసం ఉచిత షటిల్ వాహన సేవలను ప్రారంభించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైట్ సిటీ: కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం సందర్శకుల కోసం ఉచిత షటిల్ వాహన సేవలను ప్రారంభించింది. దౌత్య భవనం ప్రవేశం నుంచి ఎంబసీ ప్రాంగణం వరకు పూర్తి ఉచితంగా సందర్శకులు ఈ వాహనంలో ప్రయాణించవచ్చని సంబంధిత అధికారులు తెలిపారు. ప్రధానంగా ఈ సేవలను రాయబార కార్యాలయాన్ని సందర్శించే వృద్ధులు, చిన్న పిల్లలతో వచ్చేవారు, నడవలేని స్థితిలో ఉన్నవారి కోసం తీసుకువచ్చినట్లు ఎంబసీ వెల్లడించింది. కార్యాలయం పనిచేసే అన్ని రోజులలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ షటిల్ సర్వీస్ అందుబాటులో ఉంటుందని, దీనికి ఎలాంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని ఎంబసీ తెలియజేసింది. అలాగే అన్ని కొవిడ్-19 నిబంధనలను అనుసరించి ఈ సర్వీస్ నడపనున్నట్లు ఎంబసీ అధికారులు వెల్లడించారు. కాగా, ప్రస్తుతం ఎంబసీ ఎంట్రీ కాంపౌండ్ మెయిన్ రోడ్‌కు మార్చడంతో కార్యాలయానికి చేరుకోవడానికి సందర్శకులు చాలా దూరం నడవాల్సి వస్తోంది. ఎందుకంటే సెక్యూరిటీ కారణాల వల్ల లోపలికి వాహనాలకు అనుమతి ఉండదు. దీనిని దృష్టిలో పెట్టుకుని రాయబార కార్యాలయం ఈ ఉచిత వాహన సర్వీస్‌ను తీసుకొచ్చింది. ప్రతిరోజు వివిధ సర్వీసుల కోసం ఎంబసీకి వచ్చే వందలాది భారత సందర్శకులకు ఈ వాహన సదుపాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రధానంగా వేసవి కాలంలో ఇది సందర్శకులకు చాలా అవసరం అని ఎంబసీ అధికారులు తెలిపారు.   

Updated Date - 2021-04-06T22:26:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising