ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాలో ఉద్యోగం చేస్తూ.. తల్లిదండ్రులకు పంపిన డబ్బును కాజేసిన సైబర్ నేరగాళ్లు

ABN, First Publish Date - 2021-03-06T22:53:47+05:30

ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఊహించని రీతుల్లో దాడి చేసి దొరినకాడికి దోచేస్తున్నారు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న అకౌంట్లు ఖాళీ అవ్వడం ఖాయం. సాధారణ ప్రజల నుంచి పెద్ద పెద్ద ఉద్యో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఊహించని రీతుల్లో దాడి చేసి దొరినకాడికి దోచేస్తున్నారు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న అకౌంట్లు ఖాళీ అవ్వడం ఖాయం. సాధారణ ప్రజల నుంచి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వారిని సైతం చాలా సులభంగా సైబర్ నేరగాళ్లు తమ వలలో వేసుకుంటున్నారు. ఈ తరహా వార్తలను ఎప్పటి కప్పుడు వార్తా పత్రికలు ప్రచురిస్తూ.. ప్రజలను అప్రమత్తం చేస్తున్నా.. కొందరు గ్రహించలేకపోతున్నారు. అవగాహన లోపంతో ఒకటికి రెండు సార్లు.. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని పోలీసులను అశ్రయిస్తున్నారు. ఇందుకు తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఘటనే ఉదహరణ. 



హైదరాబాద్‌లో బేగంపేట గ్రీన్ లాండ్ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో 80ఏళ్లు దాటిన వృద్ధ దంపతులు నివసిస్తున్నారు. వీరి కొడుకు అమెరికాలో ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడ్డాడు. ఖర్చుల కోసం తల్లిదండ్రుల అకౌంట్లోకి ప్రతినెలా డబ్బును పంపిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం వీరి అకౌంట్లో నుంచి దాదాపు రూ. 10 లక్షలను సైబర్ నేరగాళ్లు కాజేశారు. ఈ నేపథ్యంలో సదరు వృద్ధ దంపతులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ మొత్తాన్ని రికవరి చేసి, వారికి అందించారు. అంతేకాకండా సైబర్ నేరగాళ్ల గురించి పోలీసులు వారికి అవగాహన కల్పించారు. అయినప్పటికీ ఆ వృద్ధ దంపతులు మరోసారి సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కారు. ప్రముఖ భీమా కంపెనీ నుంచి ఫోన్ చేస్తున్నట్టు ఓ వ్యక్తి మాట్లాడి.. ‘ఆరోగ్య బీమా‌తో పాటు అదనంగా బోనస్ కూడా ఇప్పిస్తాం’ అని చెప్పడంతో ఆ వృద్ధ దంపతులు అతని మాటలు నమ్మారు. ఏకంగా నాలుగు పాలసీలు తీసుకున్నారు. 


ఈ క్రమంలో మరోవ్యక్తి ఫోన్ చేసి.. పాలసీల నిమిత్తం కొత్తగా బ్యాంక్ అకౌంట్లు తెరవాలంటూ సూచించాడు. అనంతరం ఓ మహిళ.. తాను ఆర్బీఎల్ బ్యాంక్ మేనేజర్ అని తనను తాను పరిచయం చేసుకుని.. అకౌంట్ కోసం సదరు వృద్ధ దంపతుల వివరాలను తీసుకుంది. అనంతరం అదే ముఠాకు చెందిన మరొకరు ఫోన్ చేసి.. తాము పంపిన లింక్‌ ద్వారా రూ.15లక్షలు పంపాలని కోరారు. ఈ క్రమంలో ఆ మొత్తాన్ని వృద్ధ దంపతులు ఆన్‌లైన్ ద్వారా పంపించారు. అనంతరం బోనస్ విషయం మాట్లాడేందుకు.. మొదటగా ఫోన్ చేసిన వ్యక్తికి ఫోన్ చేయగా.. అతని ఫోన్ కలవలేదు. ఈ క్రమంలో వారిని సంప్రదించిన ఇతరుల ఫోన్ నెంబర్‌లకు ఆ దంపతులు కాల్ చేశారు. అక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్ అవ్వడంతో సదరు వృద్ధ దంపతులు పోలీసులను ఆశ్రయించారు. ఈ వృద్ధ దంపతులు 2018లో కూడా ఇదే తరహాలో మోసపోయారని పోలీసులు పేర్కొన్నారు. 


Updated Date - 2021-03-06T22:53:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising