ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బహిరంగ ప్రదేశాల్లో ఒకరితో మరొకరు మాట్లాడొద్దు.. ఫ్రెంచ్ వైద్యుల సూచన

ABN, First Publish Date - 2021-01-24T17:01:28+05:30

ఫ్రాన్స్‌లో కరోనా విపరీతంగా వ్యాప్తి చెందుతోంది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు ఫ్రెంచ్ నేషనల్ అకాడమీ ఆఫ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పారిస్: ఫ్రాన్స్‌లో కరోనా విపరీతంగా వ్యాప్తి చెందుతోంది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు ఫ్రెంచ్ నేషనల్ అకాడమీ ఆఫ్ మెడిసిన్ ప్రజలకు ఓ సూచన చేసింది. ప్రజలు బస్సులు, రైళ్లు ఇతర పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్స్‌లో ప్రయాణించే సమయంలో ఒకరితో మరొకరు మాట్లాడుకోవద్దంటూ సూచించింది. ఇలా చేస్తే కరోనా వ్యాప్తిని తగ్గించవచ్చని నేషనల్ అకాడమీ చెప్పుకొచ్చింది. ఇది కేవలం తాము చేస్తున్న సిఫారసు మాత్రమే అని స్పష్టం చేసింది. మాట్లాడే సమయంలో వైరస్ తుంపర్ల రూపంలో ఒకరి నుంచి మరొకరికి ప్రవేశిస్తుందనేది తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలోనే ఫ్రెంచ్ వైద్యులు ఈ సూచన చేసినట్టు తెలుస్తోంది. కాగా.. ఫ్రాన్స్‌లో ఇప్పటివరకు మొత్తం 30,35,181 కరోనా కేసులు నమోదయ్యాయి. మరోపక్క కరోనా బారిన పడి 72,877 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఫ్రాన్స్‌లోనూ ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైపోయింది. ఫ్రాన్స్‌లోని ప్రతి ఒక్క పౌరుడికి వ్యాక్సిన్ డోస్ వేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

Updated Date - 2021-01-24T17:01:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising