ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డొనాల్డ్ ట్రంప్‌కు షాకిచ్చిన సొంతపార్టీ నేతలు!

ABN, First Publish Date - 2021-01-14T14:00:30+05:30

కేపిటల్ ఘటన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను పదవి నుంచి తొలగించేందుకు డెమొక్రాట్లు ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానానికి ఆమోదం లభించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: కేపిటల్ ఘటన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను పదవి నుంచి తొలగించేందుకు డెమొక్రాట్లు ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానానికి ఆమోదం లభించింది. ఈ తీర్మానానికి పది మంది రిపబ్లికన్లు సహా మెజారిటీ సభ్యులు మద్దతు తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. గత ఏడాది అధ్యక్ష పీఠానికి జరిగిన ఎన్నికల్లో బైడెన్ ఘన విజయం సాధించారు. అయితే ట్రంప్ మాత్రం ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ పదేపదే ఆరోపించారు. ఈ క్రమంలో బైడెన్ విజయాన్ని ధ్రువీకరించడం కోసం ఈనెల 6న కేపిటల్ భవనంలో యూఎస్ కాంగ్రెస్ సమావేశమైంది. కాగా.. ట్రంప్ పిలుపుతో అప్పటికే అక్కడకు చేరుకున్న ఆయన మద్దతుదారులు కేపిటల్ భవనంలోకి చొరబడి బీభత్సం సృష్టించారు. ఈ ఘర్షణల్లో మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.


కేపిటల్ ఘటనకు ట్రంపే కారణం అంటూ ప్రతినిధుల సభ ఆగ్రహం వ్యక్తం చేసింది. అధ్యక్ష పదవి నుంచి ట్రంప్ తక్షణం దిగిపోవాలని డిమాండ్ చేసింది. అయితే ట్రంప్ దీనికి నిరాకరించిన విషయం. తెలిసిందే. ఈ క్రమంలో భారీ భద్రత నడుమ బుధవారం రోజు ట్రంప్‌ను పదవి నుంచి తొలగించేందుకు దిగువసభలో డెమొక్రాట్లు అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఓటింగ్ జరపగా 232 మంది అభిశంసన తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. కేవలం 197 మంది మాత్రమే వ్యతిరేకించారు. దీంతో ట్రంప్‌పై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానానికి దిగువ సభ ఆమోదముద్ర పడింది. కాగా.. ఈ తీర్మానానికి సెనేట్ కూడా ఆమోదం తెలిపితే.. ట్రంప్ అధ్యక్ష పదవిని కొల్పోతారు. 






ఇదిలా ఉంటే.. దిగువ సభలో అభిశంసన తీర్మానంపై జరిగిన ఓటింగ్‌ సందర్భంగా ట్రంప్‌కు సొంతపార్టీ సభ్యులు షాకిచ్చారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా సుమారు పది మంది రిపబ్లికన్లు ఓటు వేశారు. ట్రంప్ అధ్యక్ష పదవి నుంచి తొలగిపోవాలని కోరుకున్న రిపబ్లికన్‌ల జాబితాలో డాన్ న్యూహౌస్, జాన్ కట్కో, జైమ్ హెర్రెర బీట్లర్, ఆడమ్ కిన్‌జింజర్, ఫ్రెడ్ ఆప్టన్, లిజ్ చెనీ, పీటర్ మీజర్, ఆంథోనీ గొంజాలెజ్, టామ్ రైస్, డేవిడ్ వలడావో తదితరులు ఉన్నారు. 


Updated Date - 2021-01-14T14:00:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising