ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెళ్లేముందు జోరు చూపిస్తున్న ట్రంప్.. విదేశీయులకు న్యూఇయర్ షాక్ !

ABN, First Publish Date - 2021-01-01T20:11:45+05:30

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెళ్తూ.. వెళ్తూ మరోసారి ట్రంపరితనం చూపించారు. మహమ్మారి కరోనా నేపథ్యంలో ఉపాధి ఆధారిత వీసాలు, అమెరికాలో శాశ్వత నివాస హోదా కల్పించే గ్రీన్‌కార్డుల జారీపై విధించిన నిషేధ ఆంక్షలను ట్రంప్ మరోసారి పొడిగించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెళ్తూ.. వెళ్తూ 'ట్రంపరితనం'.. వీసాలపై ఆంక్షలు పొడిగింపు!

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెళ్తూ.. వెళ్తూ మరోసారి ట్రంపరితనం చూపించారు. మహమ్మారి కరోనా నేపథ్యంలో ఉపాధి ఆధారిత వీసాలు, అమెరికాలో శాశ్వత నివాస హోదా కల్పించే గ్రీన్‌కార్డుల జారీపై విధించిన నిషేధ ఆంక్షలను ట్రంప్ మరోసారి పొడిగించారు. మునుపటి ఉత్తర్వుల ప్రకారం ఈ ఆంక్షలు గురువారం(డిసెంబర్ 31)తో ముగిశాయి. కానీ, తాజాగా 2021 మార్చి 31 వరకు నిషేధ ఆంక్షలు అలాగే కొనసాగుతాయని ఆదేశాలు జారీ చేశారు. దీంతో కొత్త ఏడాదిలో అమెరికాలో ఉద్యోగం కోసం వెళ్లేందుకు సిద్ధమవుతున్న విదేశీ నిపుణులకు ప్రధానంగా భారతీయులకు ట్రంప్ న్యూ ఇయర్ నాడు గట్టి షాకిచ్చినట్లైంది. అలాగే అమెరికాలో చట్టాలను ఉల్లంఘించిన పౌరులను స్వదేశానికి రప్పించడానికి నిరాకరించిన దేశాలపై వీసా ఆంక్షలను సైతం ట్రంప్ గురువారం నిరవధికంగా పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మరికొన్ని గంటల్లో ఈ ఆంక్షల గడువు ముగుస్తుందనగా నిషేధాన్ని పొడిగించడం గమనార్హం. 


ఇదిలాఉంటే.. అమెరికాలో మహమ్మారి దెబ్బతో నిరుద్యోగిత మునుపెన్నడూ లేనివిధంగా పెరిగిపోయింది. దీంతో అమెరికన్ల ఉద్యోగ ప్రయోజనాలను కాపాడేందుకు ట్రంప్ ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం దేశంలో సుమారు రెండు కోట్ల మంది ప్రభుత్వం అందించే నిరుద్యోగ భృతి పొందుతున్నారు. వైరస్ ప్రభావం పెరిగే కొద్ది ఉపాధి కోల్పోయిన వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. దీంతో అమెరికాలో ఉపాధి పొందుతున్న విదేశీయుల వెసులుబాట్లపై ట్రంప్ దృష్టిసారించారు. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ నుంచి విదేశీయులకు ఇచ్చే వర్క్ వీసాలు తదితర అంశాలపై ఆంక్షలు విధించడం ప్రారంభించారు. మొదట యూఎస్‌లో నివసిస్తున్న విదేశీయుల కుటుంబాలకు గ్రీన్‌కార్డుల జారీపై నిషేధం విధించారు. అనంతరం ఈ ఆంక్షలను హెచ్-1బీ, హెచ్-2బీ, జె1, ఎల్1 వీసాలకు సైతం అనువర్తించారు. అయితే, ట్రంప్ నిర్ణయాన్ని అక్కడి వ్యాపార, వాణిజ్య సంస్థలు వ్యతిరేకించాయి. వీసాలపై నిషేధం అనేది అమెరికా కంపెనీలు, వ్యాపార సముదాయాలకు తీరని నష్టం కలిగిస్తాయని తెలిపాయి. ఈ విషయమై కోర్టు మెట్లు ఎక్కాయి. దీంతో ఉత్తర్వులను నిలిపివేయాలని కాలిఫోర్నియా ఫెడరల్ జడ్జి ఆదేశించడంతో కొంత ఉపశమనం లభించింది. తాజాగా మళ్లీ వీసాలపై నిషేధ ఆంక్షలను పొడిగిస్తూ మరోసారి ట్రంపరితనం చూపించారు.


ఇక ఈ ఏడాది జనవరి 20తో ట్రంప్ పదవి కాలం ముగియనుంది. కానీ, వెళ్తూ.. వెళ్తూ తనదైన శైలిలో ఇలా షాకింగ్ నిర్ణయాలతో ట్రంప్ అందరినీ విస్మయానికి గురి చేస్తున్నారు. కాగా, ట్రంప్ నిర్ణయాలను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ తప్పుబట్టారు. తాను వచ్చాక ట్రంప్ నిర్ణయాలు చాలా వరకు వెనక్కి తీసుకుంటానని ప్రకటించినట్లు తెలుస్తోంది. అయితే, ఇది ఎంతవరకు సాధ్యమనేది తెలియదు. ఎందుకంటే ట్రంప్ ఉత్తర్వులు వెంటనే ఉపసంహరించడానికి వీలులేని విధానంలో జారీ చేసినట్లు అక్కడి నిపుణులు చెబుతున్నారు.      

Updated Date - 2021-01-01T20:11:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising