ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జార్జ్ ఫ్లాయిడ్ హత్య కేసులో తీర్పు వెల్లడించిన కోర్టు

ABN, First Publish Date - 2021-04-22T04:20:03+05:30

జార్జ్ ఫ్లాయిడ్ మరణానికి సంబంధించి కేసులో అమెరికా కోర్టు తీర్పును వెల్లడించింది. మిన్నియా పోలీస్ మాజీ అధికారి డెరెక్ చౌవిన్ కారణంగా జార్జ్ ఫ్లాయిడ్ మృతిచెందినట్టు కోర్టు గుర్తించింది. దీంతో ఆయన్ను దోషి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: జార్జ్ ఫ్లాయిడ్ మరణానికి సంబంధించి కేసులో అమెరికా కోర్టు తీర్పును వెల్లడించింది. మిన్నియా పోలీస్ మాజీ అధికారి డెరెక్ చౌవిన్ కారణంగా జార్జ్ ఫ్లాయిడ్ మృతిచెందినట్టు కోర్టు గుర్తించింది. దీంతో ఆయన్ను దోషిగా తేల్చుతూ తీర్పు వెల్లడించింది. ఈ ఘటనను ఉద్దేశపూర్వకంగా చేయని సెకండ్ డిగ్రీ మర్డర్, థర్డ్ డిగ్రీ మర్డర్‌గా కోర్టు పరగణించింది. శిక్షకు సంబంధించిన వివరాలను తరవాత ప్రకటించనున్నట్టు తెలిపింది.  ఇదిలా ఉంటే.. జార్జ్ ఫ్టాయిడ్ మృతిపై డెరిక్‌తో పాటు ఉన్న మరో ముగ్గురు పోలీసు అధికారులు కూడా అభియోగాలు నమోదయ్యాయి. వారి విచారణ ఆగస్టు నుంచి ప్రారంభం కానుంది.


కాగా.. డెరెక్ చౌవిన్‌ను కోర్టు దోషిగా తేల్చడంపట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాతోపాటు ఆయన భార్య మిచెల్ ఒబామా కూడా స్పందించారు. జో బైడెన్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ చట్టం ముందు అందరూ సమానమే అని అభిప్రాయపడ్డారు. అమెరికాలో న్యాయం జరిగిన రోజుగా కమలా హారిస్ అభివర్ణించారు. ఒబామా, ఆయన భార్య ఇద్దరూ కోర్టు తీర్పును స్వాగతించారు. అంతేకాకుండా అమెరికాలో జాతివివక్షత పూర్తిగా నశించే వరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. కాగా.. కోర్టు తీర్పుపట్ల జార్జ్ ఫ్లాయిడ్ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. 2020 మే 25న ఫేక్ కరెన్సీని సరఫరా చేశాడనే ఆరోపణలతో జార్జ్ ఫ్లాయిడ్‌ను శ్వేతజాతి పోలిస్ అధికారి డెరెక్.. రోడ్డుపై పడుకోబెట్టి మెడపై కాలితో తొక్కుతూ అతికిరాతంగా పొట్టనపెట్టుకున్న విషయం తెలిసిందే. 


Updated Date - 2021-04-22T04:20:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising