ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కలలో వచ్చిన అంకెలే.. కాసులవర్షం కురిపించాయి!

ABN, First Publish Date - 2021-01-25T01:00:10+05:30

రాత్రికి రాత్రే ఎవ్వరూ కోటీశ్వరులవ్వలేరు. ఒక వేళ అలా జరిగిందీ అంటే.. అది కలలో అయినా అయిండాలి. లేదా వారికి ఏదైనా జాక్‌పాట్ అయినా తగిలి ఉండాలి. దీన్ని మీరు కూడా ఒప్పుకుంటారు కదా. కానీ.. ఓ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కెనడా: రాత్రికి రాత్రే ఎవ్వరూ కోటీశ్వరులవ్వలేరు. ఒక వేళ అలా జరిగిందీ అంటే.. అది కలలో అయినా అయిండాలి. లేదా వారికి ఏదైనా జాక్‌పాట్ అయినా తగిలి ఉండాలి.  కానీ.. ఓ కుటుంబంపై ఈ రెండూ కలిసి కాసులవర్షం కురిపించాయి. దీంతో దెబ్బకు రూ.340 కోట్లు ఇంట్లో వచ్చి పడ్డాయి. కలేంటి.. జాక్‌పాట్ తగలడమేంటి.. కోటీశ్వరులను చేయడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? నమ్మశక్యం కానప్పటికీ ఇది నిజం. నిద్రలో వచ్చిన కల వల్లే కెనడాలోని ఓ కుటుంబం కోట్లు గెలుచుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 


కెనడాకు చెందిన ఓ వ్యక్తి లాటరీ ద్వారా తమ కుటుంబం కోట్లు గెలుచుకున్నట్టు 20ఏళ్ల క్రితం నిద్రలో కల కన్నాడు. ఉదయాన్నే లేచీ ఆ విషయాన్ని తన భార్య డెంగ్ ప్రవతౌదమ్‌(57)కు చెప్పాడు. కొన్ని నెంబర్‌ల ద్వారా కోట్లు గెలిచినట్టు వివరించాడు. ఈ క్రమంలో డెంగ్ ప్రవతౌదమ్ తన భర్త చెప్పిన మాటలను ఈ చెవితో విని.. ఆ చెవితో విడిచిపెట్టలేదు. తన భర్తకు కలలో వచ్చిన నెంబర్లు.. తమ కుటుంబంపై కాసుల వర్షం కురిపిస్తుందని బలంగా నమ్మింది. ఈ క్రమంలోనే సుమారు 20ఏళ్లుగా తన భర్త కలలో వచ్చిన నెంబర్ల ఆధారంగా ఒంటారియో లాటరీ అండ్ గేమింగ్ (ఓఎల్‌జీ)లో పాల్గొంటూ వచ్చింది. ఈ నేపథ్యంలో డిసెంబర్‌లో డెంగ్ ప్రవతౌదమ్ భర్తకు నిద్రలో వచ్చిన కల నిజమైంది. డెంగ్ ప్రవతౌదమ్ లాటరీలో 60 మిలియన్ల కెనెడియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.340కోట్లు) గెలుచుకున్నట్టు ఓఎల్‌జీ ప్రకటించింది. 


దీంతో ఆమె ఆనందానికి అవదుల్లేకుండా పోయాయి. కాగా.. ఈ సందర్భంగా డెంగ్ ప్రవతౌదమ్ స్పందించారు. ఈ విషయాన్ని మొదటగా తన భర్త చెప్పినప్పుడు తాను నమ్మలేదని చెప్పారు. అయితే అది వాస్తవం అని గ్రహించి.. ఒక్కసారిగా ఏడ్చేసినట్టు తెలిపారు. డబ్బు గెలుచుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. కరోనా నేపథ్యంలో అప్పటి వరకు చేస్తున్న కూడా పని కూడా పోయిందన్నారు. తమ కుటుంబానికి స్థానిక చర్చి సహాయం చేస్తున్నట్టు చెప్పారు. 40ఏళ్లుగా తన భర్త లేబర్‌గా పని చేస్తున్నాడని పేర్కొన్నారు. ఈ డబ్బుతో పిల్లల ఫీజులను కట్టడంతోపాటు, ఓ ఇల్లును కొనుగోలు చేయనున్నట్టు ఆమె వెల్లడించారు. అంతేకాకుండా కొవిడ్ అనంతరం ప్రపంచ యాత్రకు వెళ్లనున్నట్టు తెలిపారు. 


Updated Date - 2021-01-25T01:00:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising