ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delta variant విజృంభణ.. డబ్ల్యూహెచ్​ఓ ఆందోళన!

ABN, First Publish Date - 2021-07-22T19:53:41+05:30

భారత్‌లో వెలుగుచూసిన కరోనా డెల్టా వేరియంట్(Sars-Cov-2) ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా వ్యాప్తి చెందుతుండడం పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే 124 దేశాలకు డెల్టా పాకినట్లు వెల్లడించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత్‌లో వెలుగుచూసిన కరోనా డెల్టా వేరియంట్(Sars-Cov-2) ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా వ్యాప్తి చెందుతుండడం పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే 124 దేశాలకు డెల్టా పాకినట్లు వెల్లడించింది. ఈ వారం కొత్తగా 13 దేశాల్లో డెల్టా కేసులు నమోదైనట్లు పేర్కొంది. ఈ ఉధృతి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో వైరస్ విజృంభణ తారస్థాయికి చేరుతుందని అభిప్రాయపడింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల్లో డెల్టా వేరియంట్‌ కేసులే అధికంగా ఉంటున్నాయని డబ్ల్యూహెచ్​ఓ తెలియజేసింది. గడిచిన నాలుగు వారాల్లో నమోదైన కేసుల్లో 75శాతానికి పైగా కేసులు డెల్టావేనని స్పష్టం చేసింది. 


అలాగే భారత్‌ సహా బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, బ్రిటన్, సింగపూర్, ఇండోనేషియా, రష్యా, చైనాలో నమోదైన కొత్త కరోనా కేసుల్లో డెల్టావే 75 శాతం కంటే అధికంగా ఉన్నాయని డబ్ల్యూహెచ్​ఓ హెల్త్ ఏజెన్సీ ఆందోళన వ్యక్తం చేసింది. అటు అగ్రరాజ్యం అమెరికాలో కూడా డెల్టా ఉధృతి కొనసాగుతోంది. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో 83 శాతానికి పైగా డెల్టా కేసులు ఉన్నట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారులు మంగళవారం వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌కు ప్రధాన కేంద్రాలుగా గుర్తించిన 6 రీజియన్‌లలో కొత్త కేసుల ఉధృతి అధికంగా ఉన్నట్లు తెలిపింది. 


ఇక గడిచిన వారం రోజుల్లో ఇండోనేసియాలో కొత్త కేసుల్లో పెరుగుదల 44 శాతానికి పైగా ఉంటే.. యూకేలో ఈ వృద్ధి 41 శాతంగా నమోదైనట్లు డబ్ల్యూహెచ్​ఓ వెల్లడించింది. అయితే, భారత్‌, బ్రెజిల్‌లో మాత్రం కొత్త కేసుల్లో వృద్ధి తగ్గుతుండటం కాస్తా ఊరటనిచ్చే విషయమని పేర్కొంది. గత వారం రోజుల్లో ఇండియాలో కొత్త కేసుల్లో వృద్ధి 8 శాతానికి తగ్గితే, బ్రెజిల్‌లో 14 శాతానికి పడిపోయినట్లు పేర్కొంది. ఇదిలా ఉంటే.. బ్రిటన్‌, బంగ్లాదేశ్, చైనా, ఆస్ట్రేలియా, రష్యా, డెన్మార్క్‌లో మిగతా కరోనా వేరియంట్‌ల కంటే డెల్టా శరవేగంగా వ్యాప్తిచెందుతుందని డబ్ల్యూహెచ్​ఓ స్పష్టం చేసింది.


Updated Date - 2021-07-22T19:53:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising