ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కెనడాలో కరోనా కేసులు పెంచుతున్న న్యూఢిల్లీ-టొరంటో విమాన సర్వీసులు

ABN, First Publish Date - 2021-03-21T15:35:29+05:30

న్యూఢిల్లీ టు టొరంటో విమాన సర్వీసుల్లో ప్రయాణించే అంతర్జాతీయ ప్రయాణికులు భారీగా కరోనా బారినపడుతున్నట్లు తాజాగా కెనడా ఆరోగ్యశాఖ విడుదల చేసిన నివేదిక పేర్కొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టొరంటో: న్యూఢిల్లీ టు టొరంటో విమాన సర్వీసుల్లో ప్రయాణించే అంతర్జాతీయ ప్రయాణికులు భారీగా కరోనా బారినపడుతున్నట్లు తాజాగా కెనడా ఆరోగ్యశాఖ విడుదల చేసిన నివేదిక పేర్కొంది. ప్రతిరోజు ఎయిర్ ఇండియా, ఎయిర్ కెనడా రెండు విమాన సర్వీసులు నడిపిస్తున్నాయి. మార్చి 3 నుంచి 19వ తేదీ వరకు దేశంలో నమోదైన కేసుల్లో దాదాపుగా అన్ని కూడా న్యూఢిల్లీ-టొరంటో సర్వీసుల్లో ప్రయాణించిన వారి ద్వారానే వ్యాప్తి చెందినట్లు ఈ డేటా చెబుతోంది. మార్చి 4న ఢిల్లీ నుంచి కెనడా వెళ్లిన విమాన సర్వీసులో ఏకంగా 30 మందికి వైరస్ సోకినట్లు తేలింది. వీటిలో 9 కేసులు వాంకోవర్‌లో నమోదైతే, మరో 21 టొరంటోలో నమోదయ్యాయి. ఇక మార్చి 9, 13 తేదీల్లో ఢిల్లీ నుంచి టొరంటోలో వచ్చిన విమాన సర్వీసులు అత్యధిక పాజిటివ్ కేసులను మోసుకువచ్చాయని కెనడా ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.


మార్చి 9న ఢిల్లీ నుండి వెళ్లిన ఎయిర్ కెనడా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానంలో మొత్తం బిజినెస్ క్లాస్, ప్రీమియం ఎకానమి క్యాబిన్‌లు వైరస్‌తో ప్రభావితమయ్యాయని తెలిసింది. అలాగే మార్చి 13న టొరంటోలో దిగిన ఎయిర్ ఇండియా విమానంలోని 35 ఎకనామి క్లాస్ వరుసల్లో 22 వరుసలకు వైరస్ సోకినట్లు తేలింది. ఇలా అంతర్జాతీయ ప్రయాణికుల్లో వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో కెనడా సర్కార్ అప్రమత్తమైంది. తమ దేశానికి వచ్చే వారు విమానం ఎక్కడానికి ముందే కొవిడ్-19 నెగెటివ్ చూపించాలని నిబంధన పెట్టింది. అలాగే కెనడా చేరుకున్న తర్వాత మరోసారి కరోనా టెస్టు చేయించుకోవడంతో పాటు మూడు రోజులు ప్రభుత్వం ఎంపిక చేసిన హోటళ్లలో క్వారంటైన్‌లో ఉండాలని సంబంధిత అధికారులు వెల్లడించారు.    

Updated Date - 2021-03-21T15:35:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising