ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫ్లోరిడాలో భవనం కూలిన ఘటన.. 22కు చేరిన‌ మృతులు!

ABN, First Publish Date - 2021-07-03T18:20:50+05:30

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం మియామీలో 12 అంతస్తుల భవనం కుప్ప‌కూలిన విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫ్లోరిడా, మియామీ: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం మియామీలో 12 అంతస్తుల భవనం కుప్ప‌కూలిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో శుక్రవారం నాటికి మృతుల సంఖ్య 22కు చేరిన‌ట్లు మియామీ డెడ్ కౌంటీ మేయ‌ర్ డానీయెల్లా లెవైన్ కావా వెల్లడించారు. ఇంకా శిథిలాల కింద చిక్కుకున్న 126 మంది కోసం రెస్క్యూ సిబ్బంది వెతుకుతున్నట్లు మేయర్ తెలిపారు. ప్రస్తుతం 400 మంది రెస్క్యూ సిబ్బందితో సహాయక చర్య‌లు కొన‌సాగుతున్నాయ‌న్నారు. శిథిలాల కింద ఉన్న వారిని కాపాడేందుకు రెస్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నట్లు ఆమె చెప్పారు. సాధ్యమైనంత త్వరగా శిథిలాలను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక గత గురువారం(జూన్ 24న) మియామీలోని సర్ఫ్‌సైడ్‌లో ఉండే చాంప్లైన్ ట‌వ‌ర్స్‌ పేరిట పిలువ‌బ‌డే ఈ బ‌హుళా అంత‌స్తుల భ‌వ‌నంలోని మొత్తం 136 యూనిట్ల‌లో 55 యూనిట్లు కుప్ప‌కూలిన‌ట్లు స‌మాచారం. అయితే, భవనం కుప్పకూలిన సమయంలో ఎంతమంది లోపల ఉన్నారనే అంశంపై స్పష్టతలేదని ఫైర్ రెస్క్యూ అసిస్టెంట్ చీఫ్ రే జ‌డ‌ల్హా వెల్లడించారు. మొద‌ట భ‌వ‌నం కొంత భాగం కుప్ప‌కూల‌గా, మ‌రో 9-10 సెక‌న్ల వ్య‌వ‌ధిలో మ‌రికొంత భాగం కుప్ప‌కూలిన‌ట్లు ప్ర‌త్య‌క్ష‌సాక్షులు తెలిపారు.  

 

Updated Date - 2021-07-03T18:20:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising