ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్ ఎఫెక్ట్.. గల్ఫ్‌లో ఉద్యోగాలు కోల్పోతున్న తెలుగు ప్రవాసులు

ABN, First Publish Date - 2021-07-17T22:29:34+05:30

దేశంలో కరోనా కష్టాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే ప్రవాస భారతీయులకు మాత్రం ఇంకా తిప్పలు తగ్గలేదు. కరోనా విజృంభన సమయంలో తమ దేశాలలోకి వచ్చే విమానాలపై విధించిన నిషేధా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: దేశంలో కరోనా కష్టాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే ప్రవాస భారతీయులకు మాత్రం ఇంకా తిప్పలు తగ్గలేదు. కరోనా విజృంభన సమయంలో తమ దేశాలలోకి వచ్చే విమానాలపై విధించిన నిషేధాన్ని గల్ఫ్ దేశాలు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాయి. దీంతో భారత్ నుంచి గల్ఫ్‌కు తిరిగి రావడానికి ప్రవాసీయులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.


తాజాగా భారతీయ విమానాలపై అమలవుతున్న నిషేధాన్ని నిషేధాన్ని జూలై 31 వరకు పొడిగిస్తున్నట్లుగా యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ ప్రకటించడం తెలుగు రాష్ట్రాలలో ఇరుక్కోపోయిన ప్రవాసీయులకు శరాఘాతంగా మారింది. ఇత్తెహాద్ మరియు ఏమిరేట్స్ రెండు ఏయిర్ లైన్లు కూడ భారత్ నుంచి ఈ నెలాఖరు వరకు విమానాలను నడపబోమని ప్రకటించాయి.


కువైత్, సౌదీ అరేబియా మరియు ఒమాన్ కూడ ఇదే రకమైన నిషేధాన్ని విధించడంతో అత్యవసర పనుల కొరకు మాతృభూమికి వెళ్ళిన తెలుగు ప్రవాసీయులు గల్ఫ్‌కు తిరిగి రాలేక ఉద్యోగాలు కోల్పోతున్నారు. గల్ఫ్ దేశాల నుండి భారతదేశానికి వెళ్ళడానికి అరకొర విమానాలు నడుస్తున్నప్పటికి భారత్ నుండి తిరిగి వచ్చే విమానాలపై మాత్రం ఇంకా నిషేధం కొనసాగుతొంది.


Updated Date - 2021-07-17T22:29:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising