ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళలపై తీవ్రంగా కొవిడ్‌ ప్రభావం.. ఐరాస అధికారి అనితా భాటియా వెల్లడి

ABN, First Publish Date - 2021-03-08T09:57:58+05:30

ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలను కుదిపేసిన కరోనా మహమ్మారి ప్రభావం మహిళలపై ఎక్కువగా పడిందని ఐక్యరాజ్యసమితిలోని భారత సంతతికి చెందిన మహిళా అధికారి అనితా భాటియా తెలిపారు. మహిళా సాధికారత కోసం పనిచేసే ఐక్యరాజ్యసమితిలోని మహిళల విభాగానికి ఆమె అసిస్టెంట్‌ సెక్రటరీ జనరల్‌గా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూయార్క్‌, మార్చి 7: ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలను కుదిపేసిన కరోనా మహమ్మారి ప్రభావం మహిళలపై ఎక్కువగా పడిందని ఐక్యరాజ్యసమితిలోని భారత సంతతికి చెందిన మహిళా అధికారి అనితా భాటియా తెలిపారు. మహిళా సాధికారత కోసం పనిచేసే ఐక్యరాజ్యసమితిలోని మహిళల విభాగానికి ఆమె అసిస్టెంట్‌ సెక్రటరీ జనరల్‌గా, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో అనితా భాటియా మాట్లాడుతూ.. మహిళల ఆదాయం, ఆరోగ్యం, భద్రతపై కరోనా ప్రభావం తీవ్రంగా ఉందని ఆమె అన్నారు. మగవారితో పోలిస్తే.. మహిళలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. గతం కన్నా మగవారి పట్ల మహిళలు తీసుకున్న శ్రద్ధ మూడు రెట్లు పెరిగిందని, ఇంటిపనితోపాటు పిల్లలకు హోంవర్క్‌లో సహాయపడటం నుంచి ఆహారాన్నందించే దాకా పనులన్నీ పెరిగాయని తెలిపారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. కరోనా సంక్షోభంలో ఉద్యోగాలు కోల్పోయిన మహిళలు తిరిగి ఉద్యోగాలకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. దీనిని కేవలం వారి కుటుంబ సమస్యగానో, వ్యక్తిగత సమస్యగానో చూడరాదని, ప్రజాసమస్యగా చూడాల్సిన అవసరం ఉందని అనితా భాటియా అభిప్రాయపడ్డారు. 

Updated Date - 2021-03-08T09:57:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising