ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అగ్రరాజ్యంలో 6లక్షలు దాటిన కరోనా మరణాలు

ABN, First Publish Date - 2021-06-17T05:59:05+05:30

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయం సృష్టస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికాలో కొవిడ్ మరణాలు మంగళవారం 6లక్షలు దాటాయి. సీఎస్ఎస్ఈ గణాంకాల ప్రకారం.. అమెరికాలో ఇ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయం సృష్టస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికాలో కొవిడ్ మరణాలు మంగళవారం 6లక్షలు దాటాయి. సీఎస్ఎస్ఈ గణాంకాల ప్రకారం.. అమెరికాలో ఇప్పటి వరకు 33.4మిలియన్లల కేసులు నమోదవ్వగా.. 6,00,012 మరణాలు సంభవించాయి. కాలిఫోర్నియాలో అత్యధికంగా 63,191 మంది కొవిడ్ కాటుకు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత అత్యధిక మరణాలు న్యూయార్క్‌లో నమోదయ్యాయి. న్యూయార్క్‌లో 53,558 మంది మరణించారు. ఆ తర్వాత స్థానాల్లో టెక్సాస్(51,940), ఫ్లోరిడా (37,265) రాష్ట్రాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో దాదాపు 20శాతం, మరణాల్లో 15శానికిపైగా అమెరికాలో ఉన్నాయి. ఇదిలా ఉంటే.. గడిచిన నాలుగు నెలల్లో అమెరికాలో కేసుల సంఖ్య భారీతా తగ్గినట్టు జాన్ హాప్కిన్స్ తెలిపింది. 


Updated Date - 2021-06-17T05:59:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising