ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చైనా వ్యాక్సిన్ వాడుతున్న దేశాల్లో పెరుగుతున్న కరోనా కేసులు!

ABN, First Publish Date - 2021-06-24T00:29:26+05:30

కరోనా మహమ్మారి తొలిసారిగా వెలుగు చూసిన చైనాలో.. ఈ వైరస్‌కు వ్యాక్సిన్ కూడా అంతే త్వరగా కనిపెట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూయార్క్: కరోనా మహమ్మారి తొలిసారిగా వెలుగు చూసిన చైనాలో.. ఈ వైరస్‌కు వ్యాక్సిన్ కూడా అంతే త్వరగా కనిపెట్టారు. ఆ తర్వాత ఈ వ్యాక్సిన్‌ను పాకిస్తాన్ వంటి దేశాలు కొనుగోలు చేసి తమ ప్రజలకు అందజేస్తున్నాయి. ఇలా చైనా వ్యాక్సిన్లు అందుకున్న దేశాలకు ముచ్చెమటలు పట్టించే విషయం ఇప్పుడు వెలుగు చూసింది. చైనా తయారు చేసిన వ్యాక్సిన్లు కొత్తగా బయటపడుతున్న కరోనా వేరియంట్లను అడ్డుకోలేకపోతున్నాయని కొందరు నిపుణులు చెప్తున్నారు. ఈ మేరకు ఒక ప్రఖ్యాత పత్రిక కథనం ప్రచురించింది. దీని ప్రకారం, సేచెలిస్, చిలీ, బహ్రెయిన్, మంగోలియా వంటి దేశాల్లో చైనా తయారు  చేసిన సైనోఫార్మ్, సైనోవ్యాక్ వ్యాక్సిన్లనే ఉపయోగిస్తున్నారు. ఈ దేశాల్లో 50-68శాతం ప్రజలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయింది. అయినా సరే గడిచిన వారంరోజుల్లో వైరస్ అవుట్‌బ్రేక్ తీవ్రంగా ఉన్న టాప్ టెన్ దేశాల్లో ఈ దేశాలన్నీ ఉన్నాయి. దీన్నే ప్రస్తావించిన నిపుణులు కరోనా కొత్త వేరియంట్లపై చైనా వ్యాక్సిన్లు పెద్దగా ప్రభావం చూపడం లేదని పేర్కొన్నారు.

Updated Date - 2021-06-24T00:29:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising