ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కువైత్‌లోని ఇండియన్ ఎంబసీ కీలక ప్రకటన.. సాధారణ సేవలను..!

ABN, First Publish Date - 2021-03-05T07:03:42+05:30

కువైత్‌లోని ఇండియన్ ఎంబసీ కీలక ప్రకటన చేసింది. ఎంబసీలో సాధారణ కాన్సులర్ సేవలను మరికొంత కాలం నిలిపివేస్తున్నట్టు వెల్లడించింది. వివరాల్లోకి వెళితే.. కువైత్‌లో కరోనా మమమ్మారి విజృంభణ మ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కువైత్‌లోని ఇండియన్ ఎంబసీ కీలక ప్రకటన చేసింది. ఎంబసీలో సాధారణ కాన్సులర్ సేవలను మరికొంత కాలం నిలిపివేస్తున్నట్టు వెల్లడించింది. వివరాల్లోకి వెళితే.. కువైత్‌లో కరోనా మమమ్మారి విజృంభణ మళ్లీ మొదలైంది. ప్రతిరోజు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో సాధారణ కాన్సులర్ సేవలను కువైత్‌లోని ఇండియన్ ఎంబసీ ఈ నెల 3వరకు రద్దు చేసింది. కాగా.. కొవిడ్ ఉధృతి నేపథ్యంలో ఈ సేవలను మార్చి 11 వరకు నిలిపివేస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. కువైత్ హెల్త్ అథారిటీ చేసిన సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇండియన్ ఎంబసీ పేర్కొంది. ఎమర్జెన్సీ సేవలను మాత్రం ప్రాధాన్యత క్రమంలో అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. గడిచిన 24 గంటల్లో కువైత్‌లో 1,716 మంది మహమ్మారి బారినపడగా.. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2లక్షలకు చేరువైంది. మరణాల సంఖ్య 1,105కి చేరింది. 


Updated Date - 2021-03-05T07:03:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising