ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికా ప్రతినిధుల సభలో అంబేద్కర్ గౌరవార్థం తీర్మానం!

ABN, First Publish Date - 2021-04-16T14:32:50+05:30

భారత రాజ్యాంగ నిర్మాత, డా.​ బీఆర్​​ అంబేద్కర్​ 130వ జయంతి సందర్భంగా అమెరికా ప్రతినిధుల సభలో భారతీయ అమెరికన్​ కాంగ్రెస్ సభ్యుడు రోహ్ ఖన్నా తీర్మానం ప్రవేశపెట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: భారత రాజ్యాంగ నిర్మాత, డా.​ బీఆర్​​ అంబేద్కర్​ 130వ జయంతి సందర్భంగా అమెరికా ప్రతినిధుల సభలో భారతీయ అమెరికన్​ కాంగ్రెస్ సభ్యుడు రోహ్ ఖన్నా తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రపంచ దేశాల్లోని యువనేతలు అంబేద్కర్​​ చూపిన సమానత్వ మార్గం ద్వారా స్ఫూర్తి పొందాలని ఈ సందర్భంగా ఖన్నా పేర్కొన్నారు. కాగా, అంబేద్కర్ గౌరవార్థం అమెరికా కాంగ్రెస్​లో ఖన్నా వరుసగా రెండోసారి ఈ తీర్మానం ప్రవేశపెట్టడం విశేషం. ఈ సందర్భంగా ఖన్నా మాట్లాడుతూ.. "అంబేద్కర్​ గౌరవార్థం ఆయన 130వ జయంతి సందర్భంగా ఇవాళ నేను మరోసారి తీర్మానం ప్రవేశపెడుతున్నాను. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యువనేతలు అంబేద్కర్​​ చూపించిన సమానత్వం మార్గం ద్వారా ప్రేరణ పొందుతారని ఆశిస్తున్నాను. దళితుడైన అంబేద్కర్​​ రచించిన భారత రాజ్యాంగం ద్వారా నేడు ఎంతో మంది భారతీయులు తమ హక్కులను కాపాడుకుంటున్నారు." అని అన్నారు. అలాగే వైశాఖి పండుగ విశిష్టతను గుర్తించాలంటూ జాన్ ​గారమేండి అనే కాంగ్రెస్ సభ్యుడు ప్రతినిధుల సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. చారిత్రాత్మక, సాంస్కృతిక, మతపరమైన ఈ పండుగ ప్రాముఖ్యతను గౌరవించాలని ఆయన తన తీర్మానంలో పేర్కొన్నారు. కాగా, జాన్ ​గారమేండి అమెరికా చట్టసభలో సిక్కు కమ్యూనిటీకి నేతృత్వం వహిస్తున్నారు. 

Updated Date - 2021-04-16T14:32:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising