ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాహితీ దిగ్గజానికి నివాళి

ABN, First Publish Date - 2021-02-26T18:22:58+05:30

ప్రముఖ రచయిత సింగమనేని నారాయణ రావు మృతి పట్ల చికాగో సాహితీ వేదిక సంతాపం తెలియజేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రముఖ రచయిత సింగమనేని నారాయణ రావు మృతి పట్ల చికాగో సాహితీ వేదిక సంతాపం తెలియజేసింది. ఈ సందర్భంగా సాహితీ వేదిక ఆయనను ప్రత్యేకంగా స్మరిస్తూ ... సాహితీ దిగ్గజం, రాయలసీమ గుండెచప్పుడు వినిపించిన విలక్షణ మానవతావాది ప్రజారచయిత సింగమనేని నారాయణ మరణం తెలుగు సాహితీ లోకానికి తీరనిలోటు. కరువుకు ఆలవాలమైన రాయలసీమ దుస్థితిని మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లా దయనీయస్థితిని తన రచనలు, ప్రజాకార్యక్రమాల ద్వారా ఏ రాజకీయనాకునికి లేదా పార్టీకి తీసిపోని విధంగా ప్రజల దృష్టికి తెచ్చారు. సింగమనేని నారాయణ మరణం పట్ల సంతాపం తెలియజేస్తున్నాం. సింగమనేని నారాయణ తన అనేక రచనల్లో గుండెలను పిండేలాగా చిత్రించిన కరువు సీమ రైతుల బాధలను నివారించడానికి నిర్మాణాత్మకమైన పనులను చేపట్టడమే ప్రభుత్వం ఆయనకు అర్పించే నిజమైన నివాళి. ఆయన ఆశయాలను, స్ఫూర్తిని అందుకుని రచయితలు, సామాజిక కార్యకర్తలు పని చేయడమే ఆయనకు అంజలి ఘటించడం అవుతుంది.

చికాగో సాహితీ మిత్రుల తరపున

మెట్టుపల్లె జయదేవ రెడ్డి

సెక్రటరీ

Updated Date - 2021-02-26T18:22:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising