ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాస్కు లేకుంటే అరెస్టు.. యూఎస్ కాపిటోల్ వద్ద పోలీసులకు ఆర్డర్స్!

ABN, First Publish Date - 2021-07-30T11:07:58+05:30

యూఎస్ కాపిటోల్ పరిసరాల్లోకి మాస్కులు లేకుండా వచ్చే అధికారులు, సందర్శకులను అరెస్టు చేయాలంటూ స్థానిక పోలీసులకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: యూఎస్ కాపిటోల్ పరిసరాల్లోకి మాస్కులు లేకుండా వచ్చే అధికారులు, సందర్శకులను అరెస్టు చేయాలంటూ స్థానిక పోలీసులకు ఆదేశాలు అందాయట. అయితే ఈ నిబంధన కాంగ్రెస్ సభ్యులకు వర్తించదని తెలుస్తోంది. ఈ మేరకు హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ సూచనలు చేశారనే ఆరోపణలు అమెరికాలో వెల్లువెత్తుతున్నాయి. మాస్కులు ధరించడానికి కాంగ్రెస్ సభ్యులు నిరాకరిస్తే వారిపై అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉందట. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదలైనట్లు తెలియడంతో రిపబ్లికన్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిబంధనలు నిరంకుశత్వానికి నిదర్శనమని రిపబ్లికన్లు ఆరోపిస్తున్నారు. అయితే కాపిటోల్ పోలీసులంతా నాన్సీ పెలోసీ అదుపాజ్ఞల్లో ఉన్నారన్న ఆరోపణలను ఆమె ప్రతినిధి ఖండించారు. అయితే అసలు మాస్కులు ఎందుకు పెట్టుకోవాలని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో సీడీసీ నిర్ణయానికి సంబంధించిన డేటాను చూపించాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. కాగా, కెవిన్ మెక్‌కార్తీ అనే సభ్యుడు ‘మాస్కు తప్పనిసరి’ నిబంధనను వ్యతిరేకించడంతో పెలోసీ అతన్ని ‘మోరాన్’ (వెర్రివాడు) అంటూ నిందించిన సంగతి తెలిసిందే.

Updated Date - 2021-07-30T11:07:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising