ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులకు మద్దతు తెలిపిన కెనడా పార్టీ.. భారత ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు!

ABN, First Publish Date - 2021-04-12T14:42:38+05:30

భారత ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను ఖండిస్తూ కెనడాకు చెందిన రాజకీయ పార్టీ తన అభిప్రాయాన్ని ప్రకటించింది. భాతరదేశంలో రైతు నిరసనలకు కారణమైన మూడు వ్యవసాయ చట్టాలను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒట్టావా: భారత ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను ఖండిస్తూ కెనడాకు చెందిన రాజకీయ పార్టీ తన అభిప్రాయాన్ని ప్రకటించింది. భాతరదేశంలో రైతు నిరసనలకు కారణమైన మూడు వ్యవసాయ చట్టాలను ఖండిస్తూ న్యూ డెమొక్రటిక్ పార్టీ (ఎన్‌డీపీ).. ఓ తీర్మానానికి ఆమోదం తెలిపింది. భారత ప్రభుత్వం మానన హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోందని ఆరోపించింది. అంతేకాకుండా రైతులకు మద్దతు ఇస్తున్నట్టు స్పష్టం చేసింది. రైతుల పక్షాన నిలబడాలని కెనడా ప్రభుత్వాన్ని కోరింది. కాగా.. న్యూ డెమొక్రటిక్ పార్టీకి భారత సంతతికి చెందిన కెనడా ఎంపీ జమీత్ సింగ్ నాయకత్వం వహిస్తుస్తున్నారు. 


ఇదిలా ఉంటే.. భారత ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత ఏడాది నవంబర్ నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు నిరసనలు చేస్తున్నారు. ప్రభుత్వం తెచ్చిన చట్టాలు కార్పోరేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఆ చట్టాల వల్ల రైతులకు మేలు జరుగుతుందని చెబుతున్న విషయం తెలిసిందే. 


Updated Date - 2021-04-12T14:42:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising