ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్రివర్ణ వెలుగులతో.. భారత్‌కు సంఘీభావం తెలిపిన కెనడా నగరం

ABN, First Publish Date - 2021-05-09T14:29:43+05:30

ప్రవాసులు అధికంగా ఉండే కెనడాలోని బ్రాంప్టన్ నగరంలోని సిటీ హాల్.. కరోనాతో పోరాడుతున్న భారత్‌కు సంఘీభావం తెలుపుతూ భారత జాతీయ పతాకంలోని త్రివర్ణ వెలుగులను ప్రదర్శించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టొరంటో: భారతీయ ప్రవాసులు అధికంగా ఉండే కెనడాలోని బ్రాంప్టన్ నగరంలోని సిటీ హాల్.. కరోనాతో పోరాడుతున్న భారత్‌కు సంఘీభావం తెలుపుతూ భారత జాతీయ పతాకంలోని త్రివర్ణ వెలుగులను ప్రదర్శించింది. అలాగే ఒంటారియో ప్రావిన్స్ నుంచి న్యూఢిల్లీకి కెనడా సుమారు 3వేల వెంటిలేటర్లను పంపించింది. ఒంటారియో ప్రీమియర్ డౌగ్ ఫోర్డ్, ఆర్థిక అభివృద్ధిశాఖ మంత్రి విక్టర్ ఫెడెలి.. భారత కాన్సుల్ జనరల్ అపూర్వా శ్రీవాస్తవ, ఇతరులతో కలిసి గురువారం వెంటిలేటర్లను భారతదేశానికి తరలించడానికి జెండా ఊపారు. ఇండియన్ రెడ్ క్రాంస్ సోసైటీ భారత్‌లో ఈ వెంటిలేటర్లను అందుకోనుంది. బ్రాంప్టన్‌లోని ఓ2 టెక్నాలజీస్ ఈ వెంటిలేటర్లను రూపొందించింది. "ఇటీవల కోవిడ్-19 కారణంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న భారత ప్రజలకు సంఘీభావం తెలుపుతూ త్రివర్ణంతో బ్రాంప్టన్ సిటీ హాల్ నిన్న రాత్రి వెలిగిపోయింది." అని మేయర్ పాట్రిక్ బ్రౌన్ అన్నారు. కాగా, బ్రాంస్టన్ నగరం మొత్తం జనాభాలో సుమారు 6 లక్షల వరకు ఇండో-కెనడియన్లు ఉన్నట్లు తెలుస్తోంది.   

Updated Date - 2021-05-09T14:29:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising