ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆస్ట్రాజెనెకా డోసులను నిలిపేసిన కెనడా రాష్ట్రం.. కారణం ఏంటంటే?

ABN, First Publish Date - 2021-05-13T00:43:10+05:30

కరోనా నియంత్రణ కోసం అన్ని దేశాలూ వ్యాక్సినేషన్‌పై దృష్టి పెట్టాయి. ఇప్పుడు తాజాగా కెనడా దేశంలో ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కొవిడ్ వ్యాక్సిన్‌ వాడకాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒట్టావా: కరోనా నియంత్రణ కోసం అన్ని దేశాలూ వ్యాక్సినేషన్‌పై దృష్టి పెట్టాయి. ఇప్పుడు తాజాగా కెనడా దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఓంటారియోలో ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కొవిడ్ వ్యాక్సిన్‌ వాడకాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించారు. పలు చోట్ల ఈ వ్యాక్సిన్ తీసుకున్న ప్రజల్లో రక్తం గడ్డకట్టినట్లు తెలియడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఓంటారియో చీఫ్ మెడికల్ ఆఫీసర్ డేవిడ్ విలియమ్స్ వెల్లడించారు. తాము ఈ విషయంపై దృష్టి పెట్టామని, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ రెండో డోస్ ఇచ్చే విషయంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని విలియమ్స్ తెలిపారు.


దీనికోసం ఇప్పటి వరకూ సేకరించిన డేటాను పరిశీలిస్తున్నామని చెప్పారు. కాగా, గతంలో జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ విషయంలో కూడా ఇదే సమస్య తలెత్తింది. అప్పుడు అమెరికా ప్రభుత్వం ఈ వ్యాక్సిన్‌పై తాత్కాలిక బ్యాన్ విధించింది. అయితే ఆ తర్వాత దీని వల్ల నష్టాల కన్నా లాభాలే ఎక్కువగా ఉన్నాయని పేర్కొంటూ ఈ బ్యాన్ తొలగించిన సంగతి తెలిసిందే.

Updated Date - 2021-05-13T00:43:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising