ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అఫ్ఘాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న భారత రాయబారి.. మరో 142 మంది ప్రవాసులు

ABN, First Publish Date - 2021-08-17T17:53:45+05:30

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సీ-17 విమానంలో అఫ్ఘానిస్థాన్‌లోని భారత రాయబారి రుద్రేంద్ర టాండన్ మంగళవారం స్వదేశానికి చేరుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సీ-17 విమానంలో అఫ్ఘానిస్థాన్‌లోని భారత రాయబారి రుద్రేంద్ర టాండన్ మంగళవారం స్వదేశానికి చేరుకున్నారు. ఆయనతో పాటు ఎంబసీ సిబ్బంది, ఐటీబీపీ జవాన్లు మొత్తం 142 మందితో సీ-17 విమానం గుజరాత్‌లోని జామ్‌నగర్ ఎయిర్‌బేస్ చేరుకుంది. కాగా, కాబూల్ విమానాశ్రయంలో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా వీరిని సోమవారం సాయంత్రమే సురక్షిత ప్రాంతానికి తరలించారు. తాజాగా వారందరిని సీ-17 విమానంలో భారత్‌కు తీసుకువచ్చారు. ఇక తాలిబన్లు తిరిగి అఫ్ఘానిస్థాన్‌లో పాగ వేయడంతో ఆ దేశంలోని ప్రజలు విదేశాలకు వెళ్లిపోతున్నారు. తాలిబన్ల పాలనలో తాము బతికిబట్టకట్టలేమని వాపోతున్నారు. 20 ఏళ్ల కింద తాలిబన్ల అరాచక పాలన నుంచి విముక్తి పొందిన అఫ్ఘాన్ ప్రజలు.. రెండు దశాబ్ధాల తర్వాత మళ్లీ వారి చేతుల్లోకి దేశం వెళ్లిపోవడంతో అక్కడ ఉండలేమంటూ విదేశాలకు తరలిపోతున్నారు.    

Updated Date - 2021-08-17T17:53:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising