ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్రిటన్‌లో 12కు చేరిన ఒమైక్రాన్ మరణాలు..!

ABN, First Publish Date - 2021-12-21T02:58:09+05:30

కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ ధాటికి బ్రిటన్ అల్లాడుతోంది. రోజువారి కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ వైరస్ బారిన పడి ఇప్పటివరకూ 12 మంది మరణించారని ఉపప్రధాని డామినిక్ రాబ్ సోమవారం ప్రకటించారు. ప్రభుత్వం లెక్కల ప్రకారం.. ప్రస్తుతం ఒమైక్రాన్ బారినపడ్డ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ ధాటికి బ్రిటన్ అల్లాడుతోంది. రోజువారి కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ వైరస్ బారిన పడి ఇప్పటివరకూ 12 మంది మరణించారని ఉపప్రధాని డామినిక్ రాబ్ సోమవారం ప్రకటించారు. ప్రభుత్వం లెక్కల ప్రకారం.. ప్రస్తుతం ఒమైక్రాన్ బారినపడ్డ 104 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే..రాబోయే వారాల్లో ఒమైక్రాన్ కేసులు మరింతగా పెరిగి పతాకస్థాయికి చేరుకుంటాయని అధికారులు హెచ్చరించారు. ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 


ఇక క్రిస్మస్ వేడుకలు సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వం మరింత కఠిన ఆంక్షలు విధిస్తుందా లేదా అన్న అంశంపై బ్రిటన్‌లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  ప్రభుత్వం కరోనా ఆంక్షలు మరింత కఠినతరం చేయబోతోందా అన్న ప్రశ్నకు ఉపప్రధాని బదులిస్తూ.. ఈ పరిస్థితుల్లో ఆంక్షలపై ఎటువంటి విస్పష్ట ప్రకటన చేయలేమని పేర్కొన్నారు. ఇటువంటి సందర్భాల్లో నిర్ణయం తీసుకునేందుకు అందుబాటులో ఉన్న సమాచారంపై అధారపడతామని, ఓ నిర్ణయానికి వచ్చేందుకు మరింత సమయం పడుతుందని ఆయన చెప్పారు. అయితే..క్రిస్మస్ ముందు లాక్‌డౌన్ విధించాల్సి వస్తే..అది ప్రధాని బోరిస్ జాన్సన్ రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని అక్కడి పరిశీలకులు చెబుతున్నారు. 

Updated Date - 2021-12-21T02:58:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising