ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భవిష్యత్తులో సంక్షోభాలు: నిపుణుల కమిటీ ఏర్పాటు చేయనున్న బ్రిటన్!

ABN, First Publish Date - 2021-04-21T01:20:07+05:30

భవిష్యత్తులో రాబొయే కరోనా తరహా సంక్షోభాలకు సిద్ధమయ్యే దిశగా బ్రిటన్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వీటిని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచించేందుకు ఓ అంతర్జాతీయ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: భవిష్యత్తులో రాబోయే కరోనా తరహా సంక్షోభాలకు సిద్ధమయ్యే దిశగా బ్రిటన్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వీటి కట్టడికి తీసుకోవాల్సిన చర్యలను సూచించేందుకు అంతర్జాతీయ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఇందులో భాగంగా కొత్త వ్యాక్సిన్ల అభివృద్ధిని వేగవంతం చేస్తామని ప్రకటించింది. జీ7 దేశాల ఆధ్వర్యంలో ఈ కమిటీ ఏర్పాటు కానుంది. ‘కొత్త రోగాల నుంచి ప్రజలను రక్షించేందుకు చేసే ప్రయత్నాలను ఈ కమిటీ ముందుండి నడిపిస్తుంది’ అని బ్రిటన్ ఆరోగ్య శాఖ మంత్రి వ్యాఖ్యానించారు. ఈ కమిటీకి బ్రిటన్ సాంకేతికత సలహాదారు చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. టీకా తయారీ దారులు, శాస్త్రజ్ఞులు ఈ కమిటీలో భాగస్వాములుగా ఉండనున్నారు. 

Updated Date - 2021-04-21T01:20:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising