ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

5లక్షలు దాటిన కొవిడ్ మరణాలు.. అధ్యక్షుడికి వ్యతిరేకంగా రోడ్డెక్కిన ప్రజలు

ABN, First Publish Date - 2021-06-20T21:28:37+05:30

బ్రెజిల్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఈ క్రమంలో బ్రెజిల్‌లో కరోనా మరణాల సంఖ్య శనివారం 5లక్షలు దాటింది. దీంతో ఆ దేశ ప్రజలు అధ్యక్షుడు జైర్ బోల్సొనారో‌కు వ్యతిరేకంగా రోడ్డెక్కారు. మ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: బ్రెజిల్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఈ క్రమంలో బ్రెజిల్‌లో కరోనా మరణాల సంఖ్య శనివారం 5లక్షలు దాటింది. దీంతో ఆ దేశ ప్రజలు అధ్యక్షుడు జైర్ బోల్సొనారో‌కు వ్యతిరేకంగా రోడ్డెక్కారు. మహమ్మారి సమయంలో బోల్సొనారో అవలంభించిన వైకరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘గెట్ అవుట్ బోల్సొనారో’ అనే ప్లకార్డులను ప్రదర్శిస్తూ తమలో ఉన్న ఆగ్రహాన్ని వ్యక్త పరిచారు. ఈ సందర్భంగా 36ఏళ్ల అలైన్ రాబెలో అనే నిరసనకారుడు మాట్లాడుతూ ‘జైర్ బోల్సొనారో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేమంతా నిరసన తెలుపుతున్నాం. దేశ ప్రజల రక్షణను ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రజల ప్రాణాలను గాలికొదిలేంది. అవసరమైన మేరకు వ్యాక్సిన్‌ను కూడా కొనుగోలు చేయలేకపోయింది’ అని పేర్కొన్నారు. 



ఇదిలా ఉంటే.. దీనిపై బోల్సొనారో కార్యాలయం ఇప్పటి వరకు స్పందించలేదు. ఆ దేశ ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం.. బ్రెజిల్ జనాభాలో ఇప్పటి వరకు కేవలం 11 శాతం మంది మాత్రమే పూర్తి స్థాయిలో కొవిడ్ టీకా తీసుకున్నారు. మరో 29శాతం మంది తొలి డోసు తీసుకున్నారు. కాగా.. వచ్చే ఏడాది బ్రెజిల్‌లో ఎన్నికలు జరగనున్నాయి. తిరిగి అధికారంలోకి రావడానికి జైర్ బోల్సొనారో తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే.. దేశ వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఇటువంటి సమయంలో ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం అవడం ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. 


Updated Date - 2021-06-20T21:28:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising