ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్రెజిల్ అధ్యక్షుడికి భారీ జరిమానా.. కారణం ఏంటంటే!

ABN, First Publish Date - 2021-06-13T21:54:12+05:30

కరోనా నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సొనారోకు భారీ జరిమానా పడింది. మాస్క్ పెట్టుకోకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడం వల్ల బోల్సొనారోకు 100 డాలర్ల జరిమా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సొనారోకు భారీ జరిమానా పడింది. మాస్క్ పెట్టుకోకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడం వల్ల బోల్సొనారోకు 100 డాలర్ల జరిమానా వేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. వచ్చే ఏడాది బ్రెజిల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో తిరిగి మళ్లీ అధికారంలో రావడంపై బోల్సొనారో దృష్టిపెట్టారు. ఇందులో భాగంగానే బ్రెజిల్‌ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటనలు చేస్తూ ర్యాలీల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే శనివారం రోజు ఆయన.. సావో పాలోలో బైక్ ర్యాలీ తీశారు. ‘యాక్సిలరేట్ ఫర్ క్రైస్ట్’లో భాగంగా నిర్వహించిన ఈ ర్యాలీకి వేలాది మంది తరలివచ్చారు. ఈ ర్యాలీ సందర్భంగా బోల్సొనారో ఓపెన్ ఫేస్ హెల్మెట్ పెట్టుకుని, మాస్క్ ధరించకుండానే బైక్ నడిపారు. దీనిపై సావో పాలో గవర్నర్ జొవావో డోరియా ఆగ్రహం వ్యక్తం చేశారు. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించినందుకుగాను అధ్యక్షుడు జైర్ బోల్సొనారో‌కు 100 డాలర్ల ఫైన్ విధించారు. ఇదిలా ఉంటే.. కొవిడ్ విషయంలో మొదటి నుంచి వివాదాస్పద వ్యాక్యలు చేస్తూ పలుమార్లు వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. 


Updated Date - 2021-06-13T21:54:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising