ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గళం విప్పిన బోస్టన్ NRI టీడీపీ.. చంద్రబాబుకు మద్దతుగా నిరసన

ABN, First Publish Date - 2021-11-23T13:18:05+05:30

అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు కుటుంబానికి జరిగిన అవమానాన్ని నిరసిస్తూ బోస్టన్‌లోని గాంధీ విగ్రహం వద్ద ఎన్నారైలు ప్రతిజ్ఞ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బోస్టన్ ఎన్నారైల ప్రతిజ్ఞ

బోస్టన్: అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు కుటుంబానికి జరిగిన అవమానాన్ని నిరసిస్తూ బోస్టన్‌లోని గాంధీ విగ్రహం వద్ద ఎన్నారైలు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అంకినీడు, కోటేశ్వర రావు, శ్రీనివాస్, అరుణ, సూర్య, త్రిభువన్, శ్రీనివాస్, అనిల్, చంద్ర, కిషోర్ మాట్లాడారు. రాష్ట్రములో అరాచక పాలన నడుస్తుందని, అసెంబ్లీలో ఎప్పుడు చూస్తామనుకొని దృశ్యాలు చూడవలసివచ్చిందని విచారం వ్యక్తం చేశారు. ఇంత బాధలో కూడా కుటుంబాన్ని పక్కన పెట్టి ఒక అమ్మలాగా వరద బాధితుల కోసం నారా భువనేశ్వరి, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్నో వేలమందికి సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. దానిలో భాగంగా మేము సైతం అంటూ 2వేల డాలర్లు (1లక్ష 50 వేల రూపాయలు) విరాళాన్ని అప్పటికప్పుడు సేకరించారు ఎన్నారైలు. తమ ఉదారతను చాటుకుంటూ తామందరం ఈ స్థాయిలో ఉండటానికి చంద్రబాబు ముందు చూపేనని వారు గుర్తు చేసుకున్నారు. విలువలు విశ్వవర్ధనీయనతా అని చెప్పుకోవటం కాదు చేసి చుపిస్తున్నామన్నారు. 


దమ్ముంటే ప్రజలకు విశ్వతనీయతతో కూడిన పాలన అందించాలని డిమాండ్ చేశారు. మైసభను తలపించిన సచివాలయం ప్రక్షాళన చేయాలని కోరారు. మళ్లీ తమ నాయకుడిని రారాజుగా నిలబెట్టడం కోసం శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసి కురుక్షేత్ర రణరంగంలోకి పంపినట్టు, తాము కూడా శ్రీకృషుడి వలె తమ నాయకుని వెన్నెంటే వుంటూ కొండంత అండగా ఉంటామని, ప్రతిక్షణం శ్రమిస్తామని ఈ సందర్భంగా ఎన్నారైలు ప్రతిజ్ఞ చేశారు. ప్రతి కార్యకర్త కూడా తమ ఛాలెంజ్‌ను స్వీకరించి, ఆచరిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సురేష్, తేజ, నాగేంద్ర, సురేష్, శివ, విక్రమ్, అప్పారావు, పవన్ వివపరీతమైన చలిని సైతం లెక్క చేయకుండా రెట్టింపు ఉత్సాహంతో పాల్గొని “సిద్ధం సిద్ధం మేమంతా సిద్ధం, మేమంతా ఉన్నాం మీవెంటే ఉంటాం” అని నినాదాలతో గాంధీ విగ్రహము దగ్గర నిరసన వ్యక్తం చేశారు.



Updated Date - 2021-11-23T13:18:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising