ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అది నిజంగా అద్భుతమైన మైలురాయి.. భారత్‌ను ప్రశంసించిన బిల్ గేట్స్!

ABN, First Publish Date - 2021-08-29T00:18:38+05:30

ప్రపంచ కుబేరులలో ఒకరు, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తాజాగా భారత్‌ను ప్రశంసలతో ముంచెత్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: ప్రపంచ కుబేరులలో ఒకరు, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తాజాగా భారత్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. శుక్రవారం భారత్ ఒకేరోజు కోటికి పైగా మందికి టీకాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయమై బిల్ గేట్స్ భారత్‌ను ప్రశంసించారు. భారత్ నిజంగా అద్భుతమైన మైలురాయిని అందుకుందని ఆయన కొనియాడారు. "ప్రభుత్వం, ఆర్ అండ్ డీ కమ్యూనిటీ, వ్యాక్సిన్ తయారీదారులు, మిలియన్ల మంది ఆరోగ్య కార్యకర్తల సమిష్టి కృషి వల్ల ఈ ఘనత సాధ్యమైంది" అని పీఎంఓను ట్యాగ్ చేస్తూ బిల్ గేట్స్ ఓ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా భారత్‌కు ఆయన ప్రత్యేకంగా కంగ్రాట్స్ కూడా చెప్పారు.


ఇదిలాఉంటే.. ఇప్పటి వరకూ ఒకరోజు వ్యవధిలో చేసిన అత్యధిక వ్యాక్సినేషన్ సంఖ్య ఇదేనంటూ ఆరోగ్య శాఖ వెల్లడించింది. శుక్రవారం వేసిన కోటికి పైగా డోసులతో మొత్తం వ్యాక్సినేషన్ మోతాదుల సంఖ్య 62 కోట్లు దాటిందని పేర్కొంది. ఇక కోవిన్ పోర్టల్ వెల్లడించిన వివరాల ప్రకారం నిన్న ఒక్కరోజే కోటి 64 వేల డోసుల వ్యాక్సినేషన్ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఒకేరోజు కోటి డోసులు దాటడం నిజంగా గ్రేట్ అని, గుర్తిండిపోయే సందర్భమని ప్రధాని మోదీ అన్నారు. ఈ భారీ వ్యాక్సిన్ డ్రైవ్‌కు సహకరించిన ప్రతిఒక్కరికీ ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. 


Updated Date - 2021-08-29T00:18:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising