ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భార్య బ‌ర్త్‌డేకు బైడెన్ స్పెష‌ల్ ట్రీట్‌..!

ABN, First Publish Date - 2021-06-04T19:34:15+05:30

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ త‌న స‌తీమ‌ణి జిల్ బైడెన్ బ‌ర్త్‌డేకు స్పెష‌ల్ ట్రీట్ ఇచ్చారు. జిల్ బ‌ర్త్‌డేను సైకిల్ స‌వారీతో సెల‌బ్రేట్ చేశారు. గురువారం అమెరికా ప్ర‌థ‌మ మ‌హిళ జిల్ బైడెన్‌ 70వ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా డెలావేర్​లోని తమ రెహోబోత్​ బీచ్​ హౌస్​లో దంపతులిద్దరూ స‌ర‌దాగా సైక్లింగ్ చేస్తూ బ‌ర్త్‌డే సెల‌బ్రేట్ చేసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డెలావేర్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ త‌న స‌తీమ‌ణి జిల్ బైడెన్ బ‌ర్త్‌డేకు స్పెష‌ల్ ట్రీట్ ఇచ్చారు. జిల్ బ‌ర్త్‌డేను సైకిల్ స‌వారీతో సెల‌బ్రేట్ చేశారు. గురువారం అమెరికా ప్ర‌థ‌మ మ‌హిళ జిల్ బైడెన్‌ 70వ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా డెలావేర్​లోని తమ రెహోబోత్​ బీచ్​ హౌస్​లో దంపతులిద్దరూ స‌ర‌దాగా సైక్లింగ్ చేస్తూ బ‌ర్త్‌డే సెల‌బ్రేట్ చేసుకున్నారు. ఇలా ఈ దంప‌తులిద్ద‌రూ సైకిల్ రైడ్ కొన‌సాగిస్తున్న స‌మ‌యంలో మ‌ధ్య‌లో కొంద‌రు పాద‌చారులు జిల్‌కు బ‌ర్త్‌డే విషెష్ చెబుతూ హ్యాపీ బ‌ర్త్‌డే పాట‌ను ఆల‌పించారు. దాంతో త‌న‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్షలు చెప్పిన వారికి ఫ‌స్ట్ లేడీ థ్యాంక్స్ చెప్పారు. బైడెన్‌, జిల్ సైకిల్ రైడ్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ‌ వైర‌ల్ అవుతోంది. కాగా, అగ్రరాజ్యం చ‌రిత్ర‌లోనే అత్యంత పెద్ద వ‌య‌స్కురాలైన ప్ర‌థ‌మ మ‌హిళ‌గా జిల్ బైడెన్ చ‌రిత్ర‌కెక్కిన‌ విష‌యం తెలిసిందే.  

Updated Date - 2021-06-04T19:34:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising