ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ రాష్ట్రాల గవర్నర్లకు బైడెన్ సీరియస్ వార్నింగ్!

ABN, First Publish Date - 2021-08-20T00:22:09+05:30

త్వరలో ప్రారంభం కాబోతున్న నూతన విద్యా సంవత్సరం నుంచి పాఠశాలల్లో విద్యార్థులు మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేయడం పట్ల విముఖత చూపుతున్న రాష్ట్రాల గవర్నర్లకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బుధవారం సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: త్వరలో ప్రారంభం కాబోతున్న నూతన విద్యా సంవత్సరం నుంచి పాఠశాలల్లో విద్యార్థులు మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేయడం పట్ల విముఖత చూపుతున్న రాష్ట్రాల గవర్నర్లకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బుధవారం సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. ప్రధానంగా అగ్రరాజ్యంలోని రెండు పెద్ద రాష్ట్రాలైన ఫ్లోరిడా, టెక్సాస్ వైద్య నిపుణుల సూచనల ప్రకారం స్కూళ్లలో విద్యార్థులు ముఖానికి మాస్క్ ధరించడాన్ని తప్పనిసరి చేయడం పట్ల ఆసక్తి చూపడం లేదు. ఈ రెండు రాష్ట్రాలకు రిపబ్లికన్ పార్టీకి చెందిన గవర్నర్లు ఉన్నారు. ఈ రెండు రాష్ట్రాల గవర్నర్లను ఉద్దేశిస్తూ బైడెన్.. 'సొంత రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థుల జీవితాలను బలి చేయడం ఎంతవరకు సమంజసం' అని ప్రశ్నించారు. ఇది ఎంతమాత్రం మంచిది కాదన్నారు. ఈ విషయమై సెక్రెటరీ ఆఫ్ ఎడ్యుకేషన్ మిగ్యుల్ కార్డోనాకు కీలక సూచన చేశారు. మాస్కుల విషయంలో వైద్య నిపుణుల సూచనలను బేఖాతరు చేసే గవర్నర్లపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇదిలాఉంటే.. ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా కరోనా డెల్టా వేరియంట్ కారణంగా ప్రతిరోజు భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే.   


Updated Date - 2021-08-20T00:22:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising