ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో కీలక పదవికి ఇండియన్-అమెరికన్‌ను నామినేట్ చేసిన బైడెన్

ABN, First Publish Date - 2021-02-24T13:30:50+05:30

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇండియన్-అమెరికన్ న్యాయవాది, హక్కుల కార్యకర్త కిరణ్ అహుజా(49)ను ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇండియన్-అమెరికన్ న్యాయవాది, హక్కుల కార్యకర్త కిరణ్ అహుజా(49)ను ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్‌మెంట్‌కు హెడ్‌గా నామినేట్ చేశారు. 20 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగులు ఈ ఏజెన్సీ కింద పనిచేస్తున్నారు. బైడెన్ నామినేషన్‌ను సెనేట్ ధ్రువీకరిస్తే ఈ ఉన్నత స్థానాన్ని అధిరోహించిన మొట్టమొదటి ఇండియన్-అమెరికన్‌గా కిరణ్ అహుజా చరిత్ర సృష్టిస్తారు. బైడెన్ నామినేషన్‌ను అనేక మంది కాంగ్రెస్ సభ్యులు సమర్థిస్తున్నారు. ఈ స్థానానికి కిరణ్ అహుజా సరైన ఎంపిక అని అంటున్నారు. 


కిరణ్ అహుజా రెండు దశాబ్దాలకు పైగా ప్రజాసేవలో ఉన్నారు. ఒబామా హయాంలో వైట్‌హౌస్ తలపెట్టిన ఏషియన్ అమెరికన్స్ అండ్ పసిఫిడ్ ఐల్యాండర్స్(ఏఏపీఐ) కార్యక్రమానికి ఆమె ఆరేళ్ల పాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు. డైరెక్టర్ ఆఫ్ యూఎస్ ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్‌మెంట్‌కు 2015 నుంచి 2017 వరకు కిరణ్ అహుజా చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా వ్యవహరించారు. ఆమె ప్రస్తుతం ఫిలాంథ్రఫీ నార్త్‌వెస్ట్ అనే రీజనల్ నెట్‌వర్క్ ఆఫ్ ఫిలాంథ్రాఫిక్ ఇన్‌స్టిట్యూషన్స్‌కు సీఈఓగా వ్యవహరిస్తున్నారు. 


కిరణ్ అహుజా చిన్నతనంలోనే భారత్ నుంచి అమెరికాకు వలస వెళ్లారు. జార్జియాలో పెరిగిన ఆమె పొలిటికల్ సైన్స్‌లో బ్యాచ్‌లర్స్ డిగ్రీ చేశారు. యూనివర్శిటీ ఆఫ్ జార్జియా నుంచి లా డిగ్రీని కూడా పొందారు. కాగా.. ట్రంప్ హయాంలో అనేక ఏజెన్సీలలో నిపుణుల కొరత ఏర్పడిందని బైడెన్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని ఏజెన్సీలలోనూ నిపుణులను నియమిస్తూ బైడెన్ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. 

Updated Date - 2021-02-24T13:30:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising