ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌లో కొవిడ్ టీకా ఉత్పత్తిపై బైడెన్ కీలక వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2021-08-04T21:05:10+05:30

భారత్ సొంతంగా కరోనా టీకాలను ఉత్పత్తి చేసుకునే విధంగా సహాయ సహకారాలు అందించడానికి ప్రయత్నిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. తాజాగా ఓ మీడియా సమావేశంలో ఆ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: భారత్ సొంతంగా కరోనా టీకాలను ఉత్పత్తి చేసుకునే విధంగా సహాయ సహకారాలు అందించడానికి ప్రయత్నిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. తాజాగా  ఓ మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అందులో ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బైడెన్ స్పందించారు. జూన్ నెలలో యూరప్ ట్రిప్ సందర్భంగా ప్రపంచ దేశాలకు 500 మిలియన్ డోసుల కొవిడ్ టీకాను విరాళంగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. అంతేకాకుండా ‘టీకాలను ఉత్పత్తి చేసుకునే సామర్థ్యం ఉన్న భారత్ వంటి దేశాలు కొవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తి చేసుకునే విధంగా సహాయం చేస్తున్నాం’ అని తెలిపారు. దీని కోసం ఎటువంటి ఛార్జీలు వసూలు చేయడం లేదని బైడెన్ పేర్కొన్నారు. కరోనా విజృంభిస్తున్న వేళ ప్రపంచ దేశాలకు తాము చేయగలిగినంత సాయం చేస్తున్నట్టు బైడెన్ చెప్పారు. 


Updated Date - 2021-08-04T21:05:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising