ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా వ్యాక్సినేషన్: తన లక్ష్యాన్ని రెట్టింపు చేసిన బైడెన్ !

ABN, First Publish Date - 2021-03-26T14:27:51+05:30

మహమ్మారి కరోనా దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా అతలాకుతలమైన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే అత్యధిక కేసులు, మరణాలు యూఎస్‌లోనే నమోదయ్యాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా సుమారు 5.45 లక్షల మంది అమెరికన్లను వైరస్ బలిగొంది. ఈ క్రమంలో తాను బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అధ్యక్షుడు జో బైడెన్.. కొవిడ్-19 నుంచి దేశ ప్రజలను రక్షించేందుకు పలు​ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: మహమ్మారి కరోనా దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా అతలాకుతలమైన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే అత్యధిక కేసులు, మరణాలు యూఎస్‌లోనే నమోదయ్యాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా సుమారు 5.45 లక్షల మంది అమెరికన్లను వైరస్ బలిగొంది. ఈ క్రమంలో తాను బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అధ్యక్షుడు జో బైడెన్.. కొవిడ్-19 నుంచి దేశ ప్రజలను రక్షించేందుకు పలు​ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీనిలో ముఖ్యమైనది వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడం. దీనిలో భాగంగా తన మొదటి 100 రోజుల పాలనలో 100 మిలియన్ల మందికి వ్యాక్సిన్ అందివ్వడమే తన లక్ష్యమని బైడెన్ ప్రకటించిన విషయం తెలిసిందే.


తాజాగా వ్యాక్సినేషన్‌కు సంబంధించి తన లక్ష్యాన్ని రెట్టింపు చేస్తున్నట్టు బైడెన్ వెల్లడించారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆయన గురువారం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ.. "నా తొలి వంద రోజుల పాలనలో 100 మిలియన్ల మందికి టీకా ఇవ్వడమే లక్ష్యమని చెప్పాను. ఈ లక్ష్యాన్ని కేవలం 56 రోజుల్లోనే పూర్తి చేశాం. ఇప్పుడు ఈ లక్ష్యాన్ని రెట్టింపు చేస్తున్నాను. ఇదే వంద రోజుల్లో 200 మిలియన్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించాను." అని బైడెన్ అన్నారు.


"దేశ ప్రజలకు టీకా​ అందించడాన్ని మేము ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాం. ఇప్పుడు దాన్ని రెట్టింపు చేయడమే మా అసలు లక్ష్యం. ఇది నెరవేరుతుందనే నమ్మకం కూడా ఉంది. ఈ విషయంలో ఏ దేశమూ మా దరిదాపుల్లోకి లేదు. రాలేదు కూడా" అని బైడెన్ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ వేగం పుంజుకుందని చెప్పిన బైడెన్.. సగటున రోజుకు 2.5మిలియన్ల డోసుల టీకాలు వేయడం జరుగుతుందన్నారు. కాగా, యూఎస్​ సెంటర్స్​ ఫర్​ డిసీజ్​ కంట్రోల్​ అండ్​ ప్రివెన్షన్​(సీడీసీ) ప్రకారం.. ఇప్పటివరకు దేశంలో 13.04 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తైనట్లు తెలిసింది. 

Updated Date - 2021-03-26T14:27:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising