ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారతీయురాలికి ప్రముఖ అమెరికన్ పురస్కారం !

ABN, First Publish Date - 2021-02-24T20:30:34+05:30

అమెరికాలోని జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఆ దేశ ప్రముఖ పురస్కారానికి భారతీయ సామాజిక కార్యకర్త అంజలి భరద్వాజ్ పేరును సిఫార్సు చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికాలోని జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఆ దేశ ప్రముఖ పురస్కారానికి భారతీయ సామాజిక కార్యకర్త అంజలి భరద్వాజ్ పేరును సిఫార్సు చేసింది. పారదర్శకత, జవాబుదారీతనం సమస్యలపై పనిచేస్తున్న అంజలికి అమెరికా సర్కార్ అంతర్జాతీయ అవినీతి నిరోధక ఛాంపియన్స్ అవార్డుకు ఎంపిక చేసింది. మొత్తం 12 మందికి ఈ పురస్కారానికి ఎంపిక చేయగా, అందులో అంజలి కూడా ఒకరు. 48 ఏళ్ల అంజలి రెండు దశాబ్దాలుగా భారతదేశంలో సమాచార హక్కు ఉద్యమంలో క్రియాశీల సభ్యురాలిగా కొనసాగుతున్నారని ఈ సందర్భంగా స్టేట్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది.


అలాగే ఈ అవార్డును ఎవరైతే ప్రతికూల పరిస్థితుల్లో పారదర్శకతను కాపాడుతూ అవినీతిని ఎదుర్కోవటానికి వారి సొంత దేశాలలో జవాబుదారీతనం కోసం పనిచేస్తారో వారికి ఉద్దేశించబడిందని తెలియజేసింది. అందుకే గత కొన్నేళ్లుగా ఇండియాలో పారదర్శకత, జవాబుదారీతనం, అవినీతి నిరోధక  సమస్యలపై పోరాడుతున్న అంజలిని ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు అమెరికా విదేశాంగ కార్యదర్శి టోనీ బ్లింకెన్ మంగళవారం వెల్లడించారు. ఇక తనకు ఈ అవార్డు దక్కడం పట్ల అంజలి ఆనందం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-02-24T20:30:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising