ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాలో 2 కోట్ల వ్యాక్సిన్ల లెక్క తేలడం లేదట!

ABN, First Publish Date - 2021-02-01T07:18:57+05:30

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు, మరణాలు అమెరికాలోనే నమోదైన విషయం తెలిసిందే. మరోపక్క కరోనాను నియంత్రించేందుకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు, మరణాలు అమెరికాలోనే నమోదైన విషయం తెలిసిందే. మరోపక్క కరోనాను నియంత్రించేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా అమెరికాలో వేగంగా సాగుతోంది. ఇదిలా ఉంటే.. అమెరికాలో ప్రస్తుతం దాదాపు రెండు కోట్ల వ్యాక్సిన్ల లెక్క తేలడం లేదని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలోని అన్ని రాష్ట్రాలకు తాము ఇప్పటివరకు ఐదు కోట్ల వ్యాక్సిన్లను పంపినట్టు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) చెబుతోంది. 


తాము పంపిన వ్యాక్సిన్లలో ఇప్పటివరకు 3.11 కోట్ల వ్యాక్సిన్లను మాత్రమే వైద్యులు వేయడం జరిగిందని, మిగతా వ్యాక్సిన్ల లెక్క తేలడం లేదని తెలిపింది. వివిధ రాష్ట్రాల నుంచి లెక్కలు ఆలస్యం కావడం వల్ల దాదాపు 20 లక్షల వ్యాక్సిన్ల డేటా రావాల్సి ఉందని సీడీసీ పేర్కొంది. అయితే మిగతా వ్యాక్సిన్లు మాత్రం ఇప్పటివరకు ప్రజలకు అయితే వేయలేదని, బహుశా అవి ఇప్పటికి ఫ్రీజర్లలో, వేర్ హౌస్‌లలోనే ఉండొచ్చని చెప్పుకొచ్చింది. బైడెన్ ప్రభుత్వం వంద రోజుల్లో పది కోట్ల వ్యాక్సిన్ డోస్‌లు వేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. అయితే ఇప్పుడు వ్యాక్సిన్ డోస్‌ల లెక్కల్లో తేడా కనిపిస్తుండటంతో పది కోట్ల లక్ష్యాన్ని చేరుకుంటామా లేదా అనే సందేహాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-02-01T07:18:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising