ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాలిబన్లకు అగ్రరాజ్యం అమెరికా భారీ షాక్!

ABN, First Publish Date - 2021-08-19T01:44:00+05:30

అఫ్ఘానిస్థాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లకు అగ్రరాజ్యం అమెరికా తాజాగా భారీ షాక్ ఇచ్చింది. జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ మంగళవారం యూఎస్‌లోని అఫ్ఘానిస్థాన్ నిధుల విషయమై కీలక ప్రకటన చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అఫ్ఘానిస్థాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లకు అగ్రరాజ్యం అమెరికా తాజాగా భారీ షాక్ ఇచ్చింది. జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ మంగళవారం యూఎస్‌లోని అఫ్ఘానిస్థాన్ నిధుల విషయమై కీలక ప్రకటన చేసింది. తమ దేశంలోని బ్యాంకుల్లో ఉన్న అఫ్ఘానిస్థాన్‌కు చెందిన నిధులను ఫ్రీజ్‌ చేస్తున్నట్టు యూఎస్ ట్రెజరీ సెక్రెటరీ జానెట్ యెలెన్ ప్రకటించారు. సుమారు 9.5 బిలియన్‌ డాలర్ల(రూ.7,05,63,34,00,000) మేర నిధులను ఫ్రీజ్ చేసినట్టు చెప్పారు. యునైటెడ్ స్టేట్స్‌లో అఫ్ఘన్ ప్రభుత్వం కలిగి ఉన్న సెంట్రల్ బ్యాంక్ ఆస్తులు తాలిబన్లకు అందుబాటులో ఉండవని ఈ సందర్భంగా జానెట్ యెలెన్ పేర్కొన్నారు. తాలిబన్ల చేతిలో నిధులు దుర్వినియోగం అవుతాయన్న కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. రాజధాని కాబూల్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన తర్వాత వారికి నిధులు అందుబాటులో లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే అమెరికా ఈ చర్యకు ఉపక్రమించింది. ఇక ఇప్పటికే జర్మనీ అఫ్ఘాన్‌కు కేటాయించిన అభివృద్ధి నిధులను నిలిపివేసిన విషయం తెలిసిందే. 

Updated Date - 2021-08-19T01:44:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising