ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బతుకమ్మ ఉత్సవంకై దుబాయి చేరుకోన్న కవిత, ఎమ్మెల్యెలు.. విమానశ్రాయంలో ధూంధాం!

ABN, First Publish Date - 2021-10-24T02:27:21+05:30

ప్రపంచంలోకెల్లా ఎత్తయిన ఆకాశ హర్య్మామైన దుబాయిలోని బుర్జ్ ఖలీఫా స్ర్కిన్‌పై శనివారం రాత్రి ప్రదర్శించనున్న బతుకమ్మ ఉత్సవాన్ని తిలకించడానికి ఎమ్మెల్సి కె.కవితతో పాటు కొంత మంది శాసన సభ్యులు దుబాయికు చేరుకోన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి.. ప్రపంచంలోకెల్లా ఎత్తయిన ఆకాశ హర్య్మామైన దుబాయిలోని బుర్జ్ ఖలీఫా స్ర్కిన్‌పై శనివారం రాత్రి ప్రదర్శించనున్న బతుకమ్మ ఉత్సవాన్ని తిలకించడానికి ఎమ్మెల్సి కె.కవితతో పాటు కొంత మంది శాసన సభ్యులు దుబాయికు చేరుకోన్నారు. ఎమ్మెల్యెలు సురేందర్ రెడ్డి, గణేశ్ గుప్తా, షకీల్, ఎ. జీవన్ రెడ్డి గత కొన్ని రోజులుగా దుబాయిలో మకాం వేసి ఉండగా శనివారం కవితతో పాటు బాజిరెడ్డి గోవర్ధన్, డాక్టర్ కె.సంజయ్ కుమార్ దుబాయికు చేరుకోన్నారు.రాజ్యసభ సభ్యులు కె.ఆర్. సురేశ్ రెడ్డి కూడా కార్యక్రమంలో పాల్గోనడానికి దుబాయికు చేరుకొన్నారు.


పెద్ద సంఖ్యలో విమానశ్రాయానికి చేరుకోన్న అభిమానులు సందడి చేసారు. దుబాయిలో పని చేస్తున్న తమ తమ నియోజకవర్గాల అభిమానులతో బాజిరెడ్డి గోవర్ధన్, డాక్టర్ సంజయ్ కుమార్ క్షణం తీరిక లేకుండా గడిపారు. దుబాయి విమానశ్రాయంలో అతిధులకు తెలంగాణ ప్రవాసీ ప్రముఖులు జువ్వాడి శ్రీనివాస్ రావు, పీచర్ల కిరణ్, తోట రాంకుమార్, సలాఓద్దీన్, రమేశ్ చంద్ర, శామ్యుల్, రాధెపు సత్యం తదితరులు స్వాగతం పలికారు.  829.8 మీటర్ల యల్.ఇ.డి స్క్రీన్ పై శనివారం రాత్రి రెండు సార్లు ప్రదర్శించనున్న బతుకమ్మ ఉత్సవ ప్రదర్శనలో ప్రఖ్యాత సంగీత దర్శకులు ఎ.ఆర్.రహెమాన్ సంగీతం ప్రత్యెక ఆకర్షణగా ఉండనుంది.

Updated Date - 2021-10-24T02:27:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising