ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

'ట్రాఫిక్ వీక్ 2021' నిర్వహణకు రెడీ అవుతున్న బహ్రెయిన్!

ABN, First Publish Date - 2021-03-07T18:42:22+05:30

ప్రతి యేటా నిర్వహించే 'ట్రాఫిక్ వీక్'ను ఈ ఏడాది కూడా నిర్వహించేందుకు బహ్రెయిన్ సిద్దమవుతుందని ఆ దేశ ట్రాఫిక్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ షేక్ అబ్దుల్‌రహ్మాన్ బిన్ అబ్దుల్‌వాహాబ్ అల్ ఖలీఫా వెల్లడించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనామా: ప్రతి యేటా నిర్వహించే 'ట్రాఫిక్ వీక్'ను ఈ ఏడాది కూడా నిర్వహించేందుకు బహ్రెయిన్ సిద్దమవుతుందని ఆ దేశ ట్రాఫిక్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ షేక్ అబ్దుల్‌ రహ్మాన్ బిన్ అబ్దుల్‌వాహాబ్ అల్ ఖలీఫా వెల్లడించారు. ట్రాఫిక్ నిబంధనలపై వాహనదారుల్లో అవగాహన కల్పించడంతో పాటు రోడ్డు ప్రమాదాల నివారణరకు పాటించాల్సిన జాగ్రత్తలను సూచిస్తూ బహ్రెయిన్ ప్రతి ఏడాది వారం రోజుల పాటు ఈ ట్రాఫిక్ వీక్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. 30 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఈ కార్యక్రమం.. ప్రతి యేటా మార్చి నెలలోనే నిర్వహించడం జరుగుతుంది. ట్రాఫిక్ పట్ల అవగాహన కల్పిస్తూ ఎప్పటికప్పుడు చేపడుతున్న సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నట్లు ఈ సందర్భంగా బ్రిగేడియర్ పేర్కొన్నారు. ఈ-సర్వీస్ సేవలను ఉపయోగించుకుంటున్న వారి సంఖ్య కూడా 43 శాతం మేర పెరిగిందన్నారు. అయితే, ఈసారి ట్రాఫిక్ వీక్‌ను ప్రపంచం ఆరోగ్య సంక్షోభ సవాళ్లను ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో నిర్వహించాల్సి వస్తోందని తెలిపారు.    

Updated Date - 2021-03-07T18:42:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising