ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంచలన నిర్ణయం.. టీకా తీసుకోని వారు ఇంటి గడప దాటొద్దు..

ABN, First Publish Date - 2021-11-15T04:05:15+05:30

కరోనా కట్టడి కోసం ఆస్ట్రియా ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా టీకా తీసుకోని వారు ఇంటికే పరిమితమవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: కరోనా కట్టడి కోసం ఆస్ట్రియా ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా టీకా తీసుకోని వారు ఇంటికే పరిమితమవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కొత్త నింబధన సోమవారం నుంచి అమల్లోకి రానుంది. ఈ రూల్ పక్కాగా అమలు చేసేందుకు పోలీసులు కూడా రంగంలోకి దిగారు. సోమవారం నుంచి వివిధ చోట్ల గస్తీ కాస్తూ వీధుల్లోకి వచ్చేవారిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. టీకా తీసుకోని వారు వీధుల్లో కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. అయితే.. కొన్ని అత్యవసర సందర్భాల్లో మాత్రం టీకా తీసుకోని వారికి ఈ నిబంధన నుంచి మినహాయింపునిచ్చారు. ఆస్ట్రియా జనాభాలో ప్రస్తుతం 65 శాతం మంది కరోనా టీకా తీసుకున్నారు. కానీ..ఐరోపా ఖండంలోని ఇతర దేశాలతో పోలిస్తే ఇది కొంచెం తక్కువే. అయితే.. ఆస్పత్రుల్లో 30 శాతం ఐసీయూ బెడ్లు కరోనా పేషెంట్లతో నిండిపోయినప్పుడు ఇటువంటి నిబంధన అమలు చేస్తామని అక్కడి ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. 

Updated Date - 2021-11-15T04:05:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising