ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారతీయులకు ఊరట.. Covishield కు Australia ఆమోదం.. కానీ..

ABN, First Publish Date - 2021-10-02T18:06:04+05:30

ఆస్ట్రేలియా ప్రభుత్వం భారతీయులకు ఊరటనిచ్చే న్యూస్ చెప్పింది. భారత్‌కు చెందిన కోవిషీల్డ్ టీకాకు ఆమోదం తెలిపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిడ్నీ: ఆస్ట్రేలియా ప్రభుత్వం భారతీయులకు ఊరటనిచ్చే న్యూస్ చెప్పింది. భారత్‌కు చెందిన కోవిషీల్డ్ టీకాకు ఆమోదం తెలిపింది. దీంతో ఈ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న ప్రయాణికులు ఆ దేశానికి వెళ్లేందుకు మార్గం సుగమమైంది. కానీ, విదేశీయులపై ఉన్న బ్యాన్‌ను మాత్రం ఇంకా తొలగించలేదు. ఇప్పటికీ ఆస్ట్రేలియాలో విదేశీయుల రాకపై నిషేధం కొనసాగుతోంది. ఈ బ్యాన్‌ను ఆస్ట్రేలియా ఎప్పుడు తొలగిస్తుందో తెలియదు. అయితే, నవంబర్ నుంచి దేశ పౌరులు, నివాసితులను విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నట్లు ఆ దేశ ప్రధాని స్కాట్ మోరిసన్ శుక్రవారం వెల్లడించారు. 18 నెలల ట్రావెల్ బ్యాన్‌కు ముగింపు పలుకుతున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 80 శాతానికి పైగా మందికి వ్యాక్సినేషన్ పూర్తైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.


దేశవ్యాప్తంగా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో గతేడాది మార్చి 20 నుంచి ఆస్ట్రేలియా ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. విదేశీయుల రాకను పూర్తిగా నిషేధించింది. ప్రధానంగా సిడ్నీ, మెల్‌బోర్న్, కాన్‌బెర్రాపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. దీంతో ఈ మూడు నగరాలు పూర్తిగా మూతపడ్డాయి. తాజాగా ప్రధాని ప్రకటనతో ఈ నగరవాసులు ఊపిరిపీల్చుకున్నారు. ఇదిలాఉంటే.. త్వరలోనే విదేశీయుల రాకపై కూడా నిర్ణయం తీసుకుంటామని ప్రధాని వెల్లడించారు. అటు సిడ్నీకి చెందిన కాంటాస్ ఎయిర్‌వేస్ నవంబర్ 14 నుంచి లండన్, లాస్ ఏంజిల్స్‌కు విమాన సర్వీసులు నడపనున్నట్లు ప్రకటించింది. దీంతో త్వరలోనే విదేశీయుల రాకపై ఉన్న బ్యాన్‌ను ఆసీస్ సర్కార్ ఎత్తివేయనుందనే సంకేతాలు అందుతున్నాయి. 

Updated Date - 2021-10-02T18:06:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising