ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శుభవార్త చెప్పిన ఆస్ట్రేలియా..డిసెంబర్ 1 నుంచీ..

ABN, First Publish Date - 2021-11-23T03:30:56+05:30

ఆస్ట్రేలియా ప్రభుత్వం తాజాగా ఓ గుడ్ న్యూస్ చెప్పింది. డిసెంబర్ 1 నుంచి ఆస్ట్రేలియా వీసా కలిగిన విదేశీయులను దేశంలోని అనుమతించనున్నట్టు పేర్కొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా ప్రభుత్వం తాజాగా ఓ గుడ్ న్యూస్ చెప్పింది. డిసెంబర్ 1 నుంచి ఆస్ట్రేలియా వీసా కలిగిన విదేశీయులను దేశంలోని అనుమతించనున్నట్టు పేర్కొంది. అయితే.. కరోనా టీకా తీసుకున్న విదేశీయులకు మాత్రమే ఈ ప్రవేశార్హత ఉంది. ప్రధాని స్కాట్ మారిసన్ సోమవారం నాడు ఈ మేరకు ప్రకటించారు. కరోనా కట్టడి కోసం అక్కడి ప్రభుత్వం 2020 మే నెలలో సరిహద్దులు మూసి వేసిన విషయం తెలిసిందే. కొద్ది మంది దేశ పౌరులను, శాశ్వత నివాసార్హత కలిగిన వారు మినహా ఇతరులెవ్వరినీ  దేశంలోకి అనుమతిచ్చేది లేదని అప్పట్లో పేర్కొంది.


అయితే..గత కొద్ది వారాలుగా ఆస్ట్రేలియా ఆంక్షలను సడలిస్తూ వస్తోంది. ఆస్ట్రేలియన్లను వివాహం చేసుకున్న విదేశీయులను దేశంలోకి అనుమతిస్తున్నట్టు ఇటీవలే ప్రకటించింది. తాజాగా.. డిసెంబర్ 1 నుంచి మరిన్ని సడలింపులు అమల్లోకి తెచ్చేందుకు సిద్ధమైంది. కరోనా పూర్వపు పరిస్థితులను చేరుకునే క్రమంలో ఈ నిర్ణయం ఓ మైలురాయిగా నిలిచిపోతుందని ప్రధాని స్కాట్ మారిసన్ వ్యాఖ్యానించారు. విదేశీ విద్యార్థుల ద్వారా ఆస్ట్రేలియాకు 35 బిలియన్ డాలర్ల నిధులు వస్తాయని తెలుస్తోంది.  ప్రభుత్వ లెక్కల ప్రకారం.. 2.35 లక్షల పైచిలుకు విదేశీయుల వద్ద ఆస్ట్రేలియా వీసా ఉంటే.. వీరిలో విద్యార్థుల సంఖ్య దాదాపు 1.6 లక్షలు. 

Updated Date - 2021-11-23T03:30:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising