ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాలో కాల్పుల కలకలం.. 13 మందికి గాయాలు

ABN, First Publish Date - 2021-06-13T01:59:34+05:30

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. గుర్తు తెలియని ఓ దుండగుడు కాల్పులకు తెగబడటంతో దాదాపు 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. టెక్సాస్ రాష్ట్రం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హ్యూస్టన్: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. గుర్తు తెలియని ఓ దుండగుడు కాల్పులకు తెగబడటంతో దాదాపు 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్ నగరం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో ఓ దుండగుడు తుపాకీతో దాడికి దిగాడు. దీంతో కాల్పుల్లో సుమారు 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కాల్పులకు తెగబడ్డ దుండగుడు పరారీలో ఉన్నట్టు తెలిపారు. దుండగుడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించినట్టు పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ దాడి వెనక ఎవరెవరి హస్తం ఉందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఇదిలా ఉంటే.. ఫ్లోరిడాలోని రాయల్ పామ్ బీచ్‌లో ఉన్న పబ్లిక్స్ గ్రోసరీ స్టోర్‌లో గురువారం రోజు ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డ విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో వృద్ధ మహిళ సహా ఆమె మనవడు ప్రాణాలు కోల్పోయారు. 


Updated Date - 2021-06-13T01:59:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising