ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆస్ట్రాజెనెకా యాంటీబాడీ కాక్‌టెయిల్ వినియోగానికి అమెరికా గ్రీన్ సిగ్నల్

ABN, First Publish Date - 2021-12-10T12:09:52+05:30

కరోనా బారిన పడిన రోగుల్లో రోగ నిరోధక శక్తిని పెంచి.. వ్యాధి ముదరకుండా చేసే ఆస్ట్రాజెనెకా యాంటీబాడీ కాక్‌టెయిల్‌కు బుధవారం అమెరికా ప్రభుత్వం ముందస్తు అనుమతినిచ్చింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా బారిన పడిన రోగుల్లో రోగ నిరోధక శక్తిని పెంచి.. వ్యాధి ముదరకుండా చేసే ఆస్ట్రాజెనెకా యాంటీబాడీ కాక్‌టెయిల్‌కు బుధవారం అమెరికా ప్రభుత్వం ముందస్తు అనుమతినిచ్చింది. 

రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తులు, కరోనావైరస్ వ్యాక్సిన్‌ల వల్ల తీవ్రమైన దుష్ప్రభావాలు నివారించడానికి US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఈ యాంటీబాడీ కాక్‌టెయిల్‌ను ఉపయోగించేందుకు అనుమతి ఇచ్చింది.

ఆస్ట్రాజెనెకా యాంటీబాడీ కాక్‌టెయిల్‌ Evushieldని తొలుత నిర్దేశించిన కొంతమందికి మాత్రమే వేయాలని అమెరికా డ్రగ్ రెగ్యులటర్ FDA సూచించింది. రెండు మోనోక్లోనల్ యాంటీబాడీస్ టిక్సాగేవిమాబ్, సిల్‌గావిమాబ్‌లతో రూపొందించిన ఈ మందును ముందస్తు చికిత్స కోసం అనుమతి ఇస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. 

టీకాలు ప్రస్తుతం COVID-19కి వ్యతిరేకంగా ఉత్తమ రక్షణను అందిస్తున్నప్పటికీ, బాధితులలో రోగనిరోధక శక్తి తగ్గకుండా ఈ యాంటిబాడీ కాక్‌టెయిల్ ఉపయోగపడుతుంది అని FDA అధికారులు చెప్పారు. యాంటీబాడీ కాక్‌టెయిల్‌గా ఇప్పటికే రోచే ఫార్మసీ ఔషధం అమెరికాలో అందుబాటులో ఉండగా.. ఆస్ట్రాజెనెకా ఔషధం రెండవది.


Updated Date - 2021-12-10T12:09:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising