ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అసిస్టెడ్ సూసైడ్‌ కోసం ఆస్ట్రియాలో కొత్త ప్రతిపాదన..!

ABN, First Publish Date - 2021-10-24T03:36:40+05:30

అసిసెస్టెడ్ సూసైడ్‌కు చట్టబద్ధత కల్పించే కొత్త చట్టాన్ని ఆస్ట్రియా ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: అసిసెస్టెడ్ సూసైడ్‌కు చట్టబద్ధత కల్పించే కొత్త చట్టాన్ని ఆస్ట్రియా ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించింది. తీవ్ర అనారోగ్యాలతో మరణం అంచున ఉన్న వారు స్వచ్ఛందంగా ప్రాణాలు వదిలేందుకు ఈ చట్టం అనుమతిస్తుంది. ఇటువంటి వారు సహజ మరణం సంభవించేదాకా వేచి చూడాలని చెప్పడం వారి హక్కులను కాలరాయడమేనని అక్కడి సర్వోన్నత న్యాయస్థానం గత డిసెంబర్‌లో తీర్పు వెలువరించింది. కోర్టు తీర్పును అనుసరించి ఆస్ట్రియా ప్రభుత్వం..ఈ చట్టాన్ని ప్రతిపాదించింది.


దీనితో..అక్కడి ప్రజలకు కూడా వైద్యుల సహాయంతో జీవితం చాలించే అవకాశం త్వరలో లభించనుంది. అయితే.. ఇటువంటి నిర్ణయం తీసుకునే మనస్థితిలో వ్యక్తి ఉన్నాడని ముందుగా ఇద్దరు వైద్యులు నిర్ధారించాలి. ఆ తరువాత.. దీన్ని అమలు చేసేందుకు 12 వారాల గడువు ఉంటుంది. కొన్ని పరిమితులకు లోబడి రెండు వారాల్లోనూ అమలు చేయవచ్చు. అంతకుమునుపు స్పెయిన్ ప్రభుత్వం కూడా ఇటువంటి చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే.  

Updated Date - 2021-10-24T03:36:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising