ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బైడెన్ బృందంలో మరో భారతీయురాలికి కీలక బాధ్యతలు!

ABN, First Publish Date - 2021-07-22T20:43:17+05:30

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పరిపాలన బృందంలో మరో భారత సంతతి మహిళకు తాజాగా కీలక బాధ్యతలు దక్కాయి. భారతీయ అమెరికన్ అర్పితా భట్టాచార్యను ఇంధన శాఖ డిప్యూటీ సెక్రటరీ కార్యాలయానికి చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నియమించారు బైడెన్.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పరిపాలన బృందంలో మరో భారత సంతతి మహిళకు తాజాగా కీలక బాధ్యతలు దక్కాయి. భారతీయ అమెరికన్ అర్పితా భట్టాచార్యను ఇంధన శాఖ డిప్యూటీ సెక్రటరీ కార్యాలయానికి చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నియమించారు బైడెన్. శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా ప్రాంతంలో నివాసముండే భట్టాచార్య.. కార్లెటన్ కళాశాల, యేల్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. ఆమె పర్యావరణం, వాతావరణ మార్పులపై రచనలు కూడా చేశారు. అలాగే శాన్ ఫ్రాన్సిస్కోలోని ప్రముఖ పునరుత్పాదక సంస్థ సన్‌పవర్ కార్పొరేషన్‌లో పనిచేశారు.


ఇంధన విభాగంలో చేరడానికి ముందు ఆమె మొక్కల నుండి మాంసాన్ని తయారుచేసే ఇంపాజిబుల్ ఫుడ్స్ అనే ఆహార సంస్థలో పనిచేస్తున్నారు. అంతేగాక సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెస్‌లో ఎనర్జీ అండ్ ఎన్విరాన్‌మెంట్ టీం కోసం పాలసీ అనలిస్ట్‌గా కూడా ఆమె పనిచేశారు. ఇక తాజాగా ఇంధన శాఖలో తనకు దక్కిన కీలక పదవి పట్ల భట్టాచార్య హర్షం వ్యక్తం చేశారు. తనపై నమ్మకంతో అధ్యక్షుడు అప్పగించిన ఈ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని ఆమె పేర్కొన్నారు.    

Updated Date - 2021-07-22T20:43:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising