ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

20 ఏళ్ల క్రితం హత్య.. ఇన్నేళ్లకు ఊహించని తీర్పు చెప్పిన కోర్టు..!

ABN, First Publish Date - 2021-10-15T21:36:13+05:30

సరిగ్గా 20 ఏళ్ల క్రితం.. అంటే 2000వ సంవత్సరంలో రాబర్ట్ ప్రాణస్నేహితురాలు సూజన్ హత్య జరిగింది. ఆమె రోడ్డు ప్రమాదానికి గురైనట్లు ఘటనా స్థలంలో తేలింది. కానీ ఆమె శరీరంలో తుపాకీ బులెట్ ఉండడంతో పోలీసులు విచారణ చేపట్టారు. అలా విచారణ మొదలైన ఆ కేసులో ఎట్టకేలకు కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: చేసిన పాపం ఎప్పటికైనా పండుతుంది. కచ్చితంగా శిక్షిస్తుంది. అమెరికన్ వ్యాపారదిగ్గజం, రియల్​ ఎస్టేట్​ కింగ్ రాబర్ట్ ఎలన్ డరస్ట్ విషయంలో ఇది నిజమైంది. ప్రాణ స్నేహితురాలినే హతమార్చి, ఇన్నేళ్లుగా అందరినీ ఏమార్చి తిరుగుతున్న రాబర్ట్‌ పాపం ఇన్నేళ్లకు పండింది. ఆ హత్య కేసులో అతడిని దోషిగా తేల్చిన అమెరికన్ కోర్టు.. యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.


సరిగ్గా 20 ఏళ్ల క్రితం.. అంటే 2000వ సంవత్సరంలో రాబర్ట్ ప్రాణస్నేహితురాలు సూజన్ హత్య జరిగింది. ఆమె రోడ్డు ప్రమాదానికి గురైనట్లు ఘటనా స్థలంలో తేలింది. కానీ ఆమె శరీరంలో తుపాకీ బులెట్ ఉండడంతో పోలీసులు విచారణ చేపట్టారు. అలా విచారణ మొదలైన ఆ కేసులో ఎట్టకేలకు కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ హత్య రాబర్ట్ చేసినట్లు నమ్ముతూ అతడికి యావజ్జీవ శిక్ష విధించింది.


1982లో రాబర్ట్ తన భార్యను హత్య చేశాడు. ఆ హత్య విషయం సూజన్‌కు చెప్పాడు. అయితే ఆమె ఎవరికైనా చెబుతుందేమో అనే భయంతో ఆమెను కూడా హత్య చేశాడు. అలాగే మరో చోట పొరుగింటి వ్యక్తిని హత్య చేశాడు. ఈ హత్య కేసులన్నీ పరిశీలిస్తే రాబర్ట్‌కు మరణశిక్ష పడే అవకాశం ఉంది. కానీ భార్య హత్య కేసులో సాక్షిగా ఉండబట్టే సూజన్‌ను రాబర్ట్ హత్య చేశాడని నమ్మిన కోర్టు.. ఆ సెక్షన్ ప్రకారం యావజ్జీవ శిక్ష విధించింది. 


38 గంటల పాటు ఆన్‌లైన్‌లో ఈ కేసు విచారణ జరిగింది. నిందితుడు రాబర్ట్ అనారోగ్యంతో బాధపడుతూ వీల్ చైర్‌లో ఉన్నా కోర్టు ఏ మాత్రం దయ చూపించిలేదు. విచారణ ముగిసిన తర్వాత రాబర్ట్ ఈ హత్యలు చేసినట్లు నమ్ముతున్నామని, అతడికి యావజ్జీవ శిక్ష విధిస్తున్నామని ధర్మాసనం తీర్పు  వెలువరించింది. 8.1 బిలియన్(రూ.6 లక్షల కోట్లు)పైగా ఆస్తి పరుడైన రాబర్ట్ ఇప్పుడు కటకటాల వెనుక తన తదుపరి జీవితం గడపబోతున్నాడు. అయితే ఇప్పటికీ రాబర్ట్ తాను ఆ హత్యలు చేయలేదని గంటకు పైగా కోర్టు ముందు వాదనలు వినిపించడం గమనార్హం.

Updated Date - 2021-10-15T21:36:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising