ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

America వెళ్తున్నారా? అయితే ఇవి తెలుసుకోండి..!

ABN, First Publish Date - 2021-11-09T19:07:35+05:30

అగ్రరాజ్యం అమెరికా వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న ప్రయాణికులకు ప్రయాణ ఆంక్షలను పూర్తిగా తొలగించిన విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న ప్రయాణికులకు ప్రయాణ ఆంక్షలను పూర్తిగా తొలగించిన విషయం తెలిసిందే. దీంతో సోమవారం(నవంబర్ 8) నుంచి యూఎస్‌కు విదేశీయుల రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఇన్నాళ్లు కరోనా ఆంక్షల కారణంగా స్వదేశాల్లో చిక్కుకుపోయిన ప్రవాసులు భారీ సంఖ్యలో అగ్రరాజ్యానికి తిరిగి పయనమవుతున్నారు. ఇక కరోనా నేపథ్యంలో గతేడాది మార్చి 23 నుంచి విదేశీ ప్రయాణాలపై పూర్తిగా నిషేధం విధించిన అమెరికా సోమవారం నుంచి ఆ ఆంక్షలను తొలగించింది. దీంతో సుమారు 600 రోజుల తర్వాత విదేశీయులకు స్వేచ్ఛగా ఆ దేశానికి వెళ్లేందుకు అవకాశం దొరికింది. ఆంక్షల తొలగింపుతో నిన్నటి నుంచే ప్రవాసులు అమెరికా చేరుకుంటున్నారు. చాలా రోజుల తర్వాత తమవారిని కలుసుకుంటున్న ప్రవాసుల ఆనందానికి అవధుల్లేవు. అయితే, అమెరికా వెళ్లే ముందు బైడెన్ ప్రభుత్వం విధించిన కొన్ని నిబంధనలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. వాటిపై ఓ లుక్కేయండి. 


* అమెరికా విమానం ఎక్కేముందే విదేశీయులకు వ్యాక్సినేషన్‌ పూర్తై ఉండడం తప్పనిసరి

* 18 ఏళ్లలోపు వారు వ్యాక్సిన్ తీసుకొని ఉండాల్సిన అవసరం లేదు 

* జర్నీకి ముందు 72 గంటల్లోపు చేయించుకున్న కోవిడ్‌ టెస్టు 'నెగెటివ్‌' నివేదికను చూపించాల్సి ఉంటుంది 

* మెక్సికో, కెనడాల నుంచి రోడ్డు లేదా జల మార్గం ద్వారా వచ్చే ప్రయాణికులు కరోనా టెస్ట్​ అక్కర్లేదు 

* రెండేళ్లు, అంతకంటే చిన్న పిల్లలకు పరీక్ష అవసరం లేదు

* విమానయాన సంస్థలే ప్రయాణికుల ధృవీకరణ పత్రాలన్నీ పరిశీలించాకే ప్రయాణాలకు అనుమతించాలి 

* లేనిపక్షంలో నిబంధనలు ఉల్లంఘించే సంస్థలకు 35 వేల డాలర్ల(రూ.25.89లక్షలు) వరకు జరిమానా వేస్తామని అగ్రరాజ్యం స్పష్టం చేసింది



Updated Date - 2021-11-09T19:07:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising