ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాలో డ్రైవర్ల కొరత.. రంగంలోకి సైన్యం..!

ABN, First Publish Date - 2021-10-19T02:40:23+05:30

అమెరికా స్కూళ్లు.. డ్రైవర్ల కొరతతో సతమతమవుతున్నాయి. డ్రైవర్లు లేక అనేక స్కూళ్లు పిల్లల టూర్లను వాయిదా వేస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా స్కూళ్లు.. డ్రైవర్ల కొరతతో సతమతమవుతున్నాయి. డ్రైవర్లు లేక అనేక స్కూళ్లు పిల్లల టూర్లను వాయిదా వేస్తున్నాయి. మాసాచుసెట్స్ రాష్ట్రంలో డ్రైవర్ల కొరత తీవ్రమవడంతో అక్కడి గవర్నర్ స్వయంగా కల్పించుకోవాల్సి వచ్చింది. సైన్యంలోని 250 మందిని రంగంలోకి దింపారు. కొన్ని స్కూళ్లు విద్యార్థుల తల్లిదండ్రులకే బస్సు సర్వీసును వదులుకోవాలని సూచించాయి. ఇందుకు అంగీకరించిన వారికి కొంత డబ్బు సహాయం చేస్తామని కూడా చెబుతున్నాయంటే అక్కడి పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 


అయితే..కరోనా సంక్షోభం కారణంగా అక్కడ ఇటువంటి పరిస్థితి తలెత్తినట్టు తెలుస్తోంది. స్కూళ్లు మూతపడడంతో అనేక మంది డ్రైవర్లకు పని లేకుండా పోయింది. చాలా కాలం ఇంట్లో ఉండిపోయిన వారందరూ క్రమక్రమంగా కొత్త ఉపాధి వెతుక్కున్నారు. అక్కడి డ్రైవర్ల సగటు వయసు 51 కావడంతో అనేక మంది అనారోగ్య కారణాల రీత్యా విధులకు దూరమయ్యారు. అధిక పనివేళలు, రెండు షిఫ్టులు చేయాల్సి రావడం వంటి కారణాలతో మరికొందరు ఈ వృత్తి నుంచి వైదొలగుతున్నారు. ఫలితంగా అమెరికాలో డ్రైవర్ల కొరత 50 శాతానికి చేరుకుంది. కొత్తగా ఈ వృత్తిలోకి రావాలనుకునేవారికి లైసెన్స్ అవసరం. ఇది పొందేందుకు అధిక సమయం పట్టడంతో పాటు ఖర్చు కూడా బాగానే ఉండటం కూడా డ్రైవర్లు కావాలనుకునే వారికి అడ్డంకిగా మారింది. ఈ కొరతను అధికమించేందుకు అక్కడి సంస్థలు డ్రైవర్లకు అధికవేతనాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. అంతేకాకుండా.. పని వాతావరణాన్ని కూడా మెరుగు పరిచేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. 

Updated Date - 2021-10-19T02:40:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising